కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ అనారోగ్యంతో కన్నమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అనంత్‌కుమార్ ఊపిరితిత్తుల కేన్సర్ కబళించింది. వ్యాధికి చికిత్స నిమిత్తం ఆయన అమెరికాకు వెళ్లి అక్కడ చికిత్స పోంది ఈ అక్టోబర్ మాసంలోనే తిరిగివచ్చారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు.
న్యూయార్క్ లోని కేన్సర్ ఇనిస్టిట్యూట్ లో చికిత్సపొంది.. భారత్ కు తిరగివచ్చిన తరువాత కొన్ని రోజుల పాటు బాగానే వున్న ఆయన అరోగ్యం.. మరింతగా విషమించింది. ఆయన్ను బెంగళూరులోని శ్రీ శంకర ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనకు వెంటిలేటర్ ను అమర్చిన వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. కేన్సర్ విషమించి ఈ తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఈ వార్తతో బీజేపి శ్రేణులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. కాగా, ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని బెంగళూరు నేషనల్ కాలేజీలో ఉంచనున్నారు.
1959 జులై 22న కర్ణాటకలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన తొలిసారిగా 1996 సాధారణ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి గత ఆరు పర్యాయాలుగా అక్కడి నుంచే విజయాన్ని అందుకుంటూ వచ్చిన ఆయనకు.. ప్రధాని మోదీ మంత్రివర్గంలో స్థానం పొందారు. తొలుత ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా.. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంత్ కుమార్ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Deep sense of grief on hearing that Shri @AnanthKumar_BJP is no more with us. Served @BJP4India @BJP4Karnataka all along. Bengaluru was in his head and heart, always. May God give his family the strength to bear with this loss.
— Nirmala Sitharaman (@nsitharaman) November 12, 2018
మూడు రోజుల కిందట అనంత్‌కుమార్ భార్య తేజస్విని మాట్లాడుతూ... ఆయనకు మెరుగైన వైద్యం అందజేస్తున్నా, వ్యాధి తగ్గుముఖం పట్టడంలేదని అన్నారు. అయితే, చికిత్స స్పందిస్తున్నారని తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితర ప్రముఖులు ఇటీవలే ఆయనను పరామర్శించారు. అనంత్‌కుమార్ మృతి పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తను బీజేపీ జీర్ణించుకోలేదని, కర్ణాటకతోపాటు దేశంలో బీజేపీ ఎదుగుదలకు ఆయన ఎంతగానో శ్రమించారని, బెంగళూరులో తమపార్టీకి ఆయన ఓ గుండెకాయలాంటివారని ట్వీట్ చేశారు. అనంత్‌కుమార్ లేనిలోటును పూడ్చేందుకు వారి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Sad to hear of the passing of Union minister and veteran parliamentarian Shri H.N. Ananth Kumar. This is a tragic loss to public life in our country and particularly for the people of Karnataka. My condolences to his family, colleagues and countless associates #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) November 12, 2018
కేంద్ర మంత్రి, సీనియర్ ఎంపీ హెచ్ఎన్ అనంత్‌కుమార్ మరణం ఎంతో విషాదకరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన మరణం దేశానికి, ప్రజలకు ప్రత్యేకంగా కన్నడిగులకు తీరని లోటని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నా ముఖ్యమైన సహచరుడు, మిత్రుడు అనంత్‌కుమార్ మృతి అత్యంత బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఓ గొప్ప నాయకుడని, తన జీవితమంతా ప్రజా సేవకే అంకితం చేశారని, పిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి ఎంతో చేశారని అన్నారు. ఆయన పనితీరును తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని ట్వీట్ చేశారు.
Extremely saddened by the passing away of my valued colleague and friend, Shri Ananth Kumar Ji. He was a remarkable leader, who entered public life at a young age and went on to serve society with utmost diligence and compassion. He will always be remembered for his good work.
— Narendra Modi (@narendramodi) November 12, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more