ఆటోలో ప్రయాణికులు వున్నారు.. అందులోనూ డ్రైవర్ కూడా తెలిసినవాడేనని నమ్మకంతో ఆటో ఎక్కిన అక్కాచెల్లెళ్లను.. ఇద్దరు స్నేహితులతో కలసి అపహరించి, వారిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు అటోడ్రైవర్. నవంబర్ 9న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో ఒక నిందితుడ్ని అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో ఈ చోటుచేసుకుంది. త్రిపుర రాజధాని అగర్తలాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాశహర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 9న బాధిత అక్కాచెల్లెళ్లు తమ ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. కైలాశహర్ పట్టణం సమీపంలోని ఓ వంతెన వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో వీరి ముందు ఓ ఆటో వచ్చి ఆగింది. అందులో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఆటో డ్రైవర్ తెలిసినవాడే కావడంతో, బాధితులు ఇద్దరూ అందులో ఎక్కారు. అయితే, ఆటో కొద్ది దూరం వెళ్లగానే అందులోని ఇద్దరు వ్యక్తులూ అక్కాచెల్లెళ్లను టవల్స్‌తో చుట్టేసి, ఖొవాయి జిల్లాలోని తెలిముర పట్టణానికి తీసుకెళ్లారు.
అక్కడ ఓ గదిలో వారిని బంధించి రెండు రోజుల పాటు ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రెండు రోజుల తర్వాత తెలిముర రైల్వేస్టేషన్ వద్ద వదిలిపెట్టారు. జరిగిన దారుణాన్ని రైల్వే పోలీసులకు బాధితులు తెలియజేశారు. దీంతో వారు మహిళా పోలీసులకు సమాచారం అందించి, బాధితులను వారికి అప్పగించారు. బాధిత అక్కాచెల్లెళ్ల గురించి వారి తల్లిదండ్రులకు తెలియజేసి పిల్లల్ని నవంబరు 12న అప్పగించారు. బాలికల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more