తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీ అంచనాలను క్రమంగా కాంగ్రెస్ అధిష్టానం దూరం చేస్తుంది. మహాకూటమితో పోత్తుపెట్టుకున్న పార్టీలకు రెబల్స్ గుబులు వుంటుందని.. అధికార టీఆర్ఎస్ పార్టీ అంచనా వేసింది. దీంతో కూటమి అభ్యర్థులు పోత్తు పార్టీల రెబల్స్ తో పాటు సొంత పార్టీ రెబెల్స్ కూడా రంగంలోకి దిగడం అధికార పార్టీకి కలిసివస్తుందని కూడా భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ.. కూటమిలో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చింది అధికారికంగా పాతిక సీట్లే అయినా.. తెలంగాణ వ్యాప్తంగా రెబల్స్ గా ఎన్నికల బరిలో మాత్రం సుమారు 40 మంది కాంగ్రెస్ మంది అభ్యర్థులు బరిలో నిలిచారని సమాచారం.
ఇక మిత్రపక్ష పార్టీలు ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానం వద్దకు విషయాన్ని తీసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా పొత్తు సజావుగా సాగాలంటే రెబల్స్ ను నియంత్రించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తేల్చిచెప్పారు. దీంతో ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, సోనియాగాంధీ వ్యక్తిగత సలహాదారు అహ్మద్ పటేట్ రంగంలోకి దిగి అసంతృప్తి నేతలను బుజ్జగించి వారిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తున్నారు. అంతేకాదు వారికి పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో రెబల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాలకు కట్టుబడి మహాకూటమి అభ్యర్థులకు మద్దుతు పలుకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైటెక్ అసెంబ్లీ నియోజకవర్గంగా బాసిల్లుతూ.. కీలకమైన శేరిలింగంపల్లిలో రెబల్ గా బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ మహకూటమి అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ కు తన మద్దతు ప్రకటించారు. పార్టీ పెద్దల బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకున్న బిక్షపతి యాదవ్ ను.. గురువారం కూటమి తరపున బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ కలిశారు.
తనకు మద్దతిచ్చి పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొని గెలుపునకు సహకరించాలని అభ్యర్థించారు. దీనికి బిక్షపతి యాదవ్ కూడా తన సహకారం లభిస్తుందని హామీ ఇచ్చారు. అయితే భిక్షపతి యాదవ్ ను బుజ్జగించడానికి ఏకంగా ఆరుగురు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి కలిసినా.. నామినేషన్ ఉపసంహరణకు బిక్షపతి యాదవ్ సమ్మతించలేదు.
దీంతో మళ్లీ బుధవారం రాత్రి ఏఐసీసీ నేత అహ్మద్ పటేల్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు భిక్షపతి యాదవ్ ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. పొత్తుతో భిక్షపతికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని.. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇవాళ ఏకంగా టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్ కూడా వెళ్లి కలసి.. తన తరపున ప్రచారం నిర్వహించాలని అభ్యర్థించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more