మహాకూటమిలో అధికారికంగా కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపిఐ పార్టీలు భాగస్వాములుగా వున్నా.. అనధికారికంగా ఇప్పుడు బీఎస్పీ పార్టీ కూడా చేరిపోయింది. ఈ మిలాఖాత్ అక్కడి బీఎస్పీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నెత్తిన పాలుపోసేలా చేసింది. గత రెండు రోజుల నుంచి శరవేగంగా చేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో మల్ రెడ్డి రంగారెడ్డి విజయాన్ని నల్లేరుపై నడకగా మార్చివేసింది. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే మల్ రెడ్డి రంగారెడ్డి విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిపింది.
అదెలా అంటే మహాకూటమి భాగస్వామి పార్టీగా మారిన తెలుగుదేశం కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్లతో కుదిరిన అవగాహన మేరకు తొలుత 14 స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. అయితే, 13 చోట్ల మాత్రమే నామినేషన్ దాఖలు చేసి, ఓ సీటును వదులుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, మరోసీటును కూడా టీడీపీ త్యాగం చేసే పరిస్థితి ఎదురయ్యింది. దీంతో, చివరి క్షణంలో జరిగిన మార్పుల ఫలితంగా ఇబ్రహీంపట్నం సీటును వదిలేసుకుని 12 స్థానాలకే పరిమితమైంది.
ఈ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సామా రంగారెడ్డి తప్పుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి ఆయన ఎల్బీనగర్ నుంచి సీటు ఆశించినా, అక్కడ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో ఇష్టం లేకుండానే ఇబ్రహీంపట్నంలో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. తాజాగా ఆయన తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో బీఎస్పీ తరఫున నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతివ్వాలని మహాకూటమి నిర్ణయించింది.
బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ నేతల మధ్య జరిగిన చర్చల్లో మల్ రెడ్డి సోదరుల మధ్య రాజీ కుదిరడంతో రామిరెడ్డి తప్పుకోడానికి అంగీకరించారు. అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. మల్ రెడ్డి రంగారెడ్డితో పోటీ పడితే తన విజయావకాశాలు దెబ్బతింటాయని భావించిన సామ, తప్పుకుంటానని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం బరిలో ఉన్న మల్రెడ్డి సోదరుల్లో ఓకరికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకోగా, రామిరెడ్డి తప్పుకుంటున్నట్టు వెల్లడించడం, మల్రెడ్డి రంగారెడ్డికి మార్గం సుగమమైంది. దీంతో, టీడీపీ పోటీచేసే స్థానాల సంఖ్య 12కు పరిమితమైంది. కాగా, సామ రంగారెడ్డి తన నామినేషన్ను గురువారం ఉపసంహరించుకోనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more