ఇప్పటికే ఓ వైపు దేశంలోని స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన ప్రతిష్టాత్మక సంస్థలను బీజేపి పార్టీ తమ అదుపాజ్ఞనల్లోకి తీసుకుందని అరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా బీజేపి ప్రభుత్వం అదుపాజ్ఞల్లోనే వుందని ఇప్పటికే పలు ఘటనల ద్వారా నిరూపితమైందని ప్రతిపక్షాలు అరోపిస్తు్న్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కూడా బీజేపి అవలంభిస్తున్న మీడియా ప్రకటనలపై కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్న అరోపణలు వినబడుతున్నాయి.
దేశంలో టీవీ ప్రకటన ద్వారా ప్రచారం చేయడంలో నెంబర్ వన్ ఎవరు? జవాబు భారతీయ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు మాత్రం కాదు. ఒక రాజకీయ పార్టీ టీవీ ప్రకటనల్లో అగ్రభాగాన నిలిచింది. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో బీజేపీ టీవీ ప్రకటనల జోరు పెరిగింది. ప్రచార ప్రకటనల్లో బడా బడా కంపెనీలనే వెనక్కి నెట్టేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీవీ ప్రకటనల్లో టాప్ 10 బ్రాండ్లలో ప్రముఖ విపక్ష పార్టీ కాంగ్రెస్ లేదు. ఈ విషయాన్ని బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తన రిపోర్ట్ లో తెలిపింది. బార్క్ కొత్త రిపోర్ట్ ప్రకారం నవంబర్ 16కి ముగిసిన వారంలో విమల్ పాన్ మసాలా బాగా వెనుకబడి పోయింది.
22,099 సార్లు బీజేపీ ప్రకటనలు
ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించిన వార్త మేరకు నవంబర్ 10 -16 వారంలో టీవీలో ప్రసారమైన ప్రకటనల్లో బ్రాండ్ కంపెనీల కంటే ఎక్కువగా బీజేపీ ప్రకటనలే కనిపించింది. ఆ తర్వాత స్థానాల్లో నెట్ ఫ్లిక్స్, ట్రివాగో ఉన్నాయి. ఈ వారం టీవీలో మొత్తం 22,099 సార్లు బీజేపీ ప్రకటనలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత 12,951 సార్లు నెట్ ఫ్లిక్స్ యాడ్ కనిపించింది. 12,795 యాడ్స్ తో ట్రివాగో మూడో స్థానంలో నిలిచింది.
నెంబర్ 1, 2 మధ్య 9,000 తేడా
టీవీలో యాడ్ ఇచ్చే విషయంలో దేశంలోని మిగతా పార్టీల కంటే బీజేపీ ఎంత ముందు ఉందో ఈ అంకెలే చెబుతాయి. నెంబర్ 2గా ఉన్న నెట్ ఫ్లిక్స్ కి బీజేపీకి మధ్య 9,000 తేడా ఉంది. ప్రకటనల విషయంలో సంతూర్ సబ్బు 11,222 సార్లు కనిపించి నాలుగో స్థానంలో ఉంది. గత వారం టీవీ ప్రకటనల్లో రెండో స్థానంలో ఉన్న బీజేపీ ఈ వారం అమాంతంగా భారీ తేడాతో మొదటి స్థానం సాధించింది.
టాప్ 10లోని మిగతా ప్రకటనకర్తల విషయం చెప్పాలంటే డెట్టాల్ (9,487) 5వ స్థానం, వైప్ (9,082) 6వ స్థానం, కోల్గేట్ డెంటల్ క్రీమ్ (8,938) 7వ స్థానం, డెట్టాల్ టాయిలెట్ సోప్ (8,633) 8వ స్థానం, అమెజాన్ ప్రైమ్ వీడియో (8,031) 9వ స్థానం, రూప్ మంత్ర ఆయూర్ ఫేస్ క్రీమ్ (7,962) 10వ స్థానంలో ఉన్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్ లలోని ప్రతిపక్షాలు ఈ ప్రకటనలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సంయుక్తంగా దీనిపై విచారణ సాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more