పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీలకు కొమ్ముకాయొద్దని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు పోలీసులు, అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారన్న పిటీషన్లపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఎన్నికల్లో ప్రభుత్వాధికారులు ఏ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించరాదని పేర్కొంది. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులెవరూ పార్టీల జెండా మోయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఏ రాజకీయ పార్టీకీ విధేయత చూపకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించింది. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థి, ఏజెంట్ తప్ప ఇతరులెవ్వరినీ అనుమతించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ మజ్లిస్ బచావో తెహ్రీక్ అధ్యక్షుడు మజీదుల్లాఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.పాతబస్తీలోని పోలింగ్ కేంద్రాల్లోకి ఎంఐఎంకి చెందిన సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు 100-200 మంది దాకా అనుచరులతో కలిసి వస్తుంటారని, ఇతర పార్టీల ఏజెంట్లను బెదిరిస్తున్నారని, కొన్నేళ్లుగా మా అభ్యర్థులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మజీదుల్లాఖాన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని గతంలో ఆదేశించింది.
దీంతో ఎన్నికల సంఘం కౌంటరు దాఖలు చేసింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈసీ తన అఫిడ్‌విట్‌లో తెలిపింది. దీన్ని రికార్డు చేసిన ధర్మాసనం అభ్యంతరాలుంటే తెలపాలని పిటిషనర్‌ను కోరింది. అనంతర విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇదే అంశంపై నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను డిసెంబరు 6కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more