Some decisions go against your wishes: Scindia అధిష్టానం అన్ని నిర్ణయాలు అనుకూలంగా వుండవు: సింధియా

Some decisions go against your wishes jyotiraditya scindia

Madhya Pradesh, kamal nath, jyotiraditya scindia, madhya pradesh chief minister, Congress, congress high command

A day after Congress president Rahul Gandhi chose Madhya Pradesh PCC chief Kamal Nath over him, Jyotiraditya Scindia told that some decisions go against one's personal wishes.

అధిష్టానం అన్ని నిర్ణయాలు అనుకూలంగా వుండవు: సింధియా

Posted: 12/15/2018 10:06 AM IST
Some decisions go against your wishes jyotiraditya scindia

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో తుదివరకు పోటీగా నిలిచి.. పార్టీ అధిష్టానం కొరిక మేరకు తప్పుకున్న యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ వున్న నేతకు కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటు చీఫ్ విఫ్ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. అధిష్ఠానం పీసీసీ చీఫ్ కమల్‌ నాథ్ కే ఓటు వేయడంతో, పార్టీ నిర్ణయాలు అన్ని వేళలా తమకు అనుకూలంగా వుండవని అన్నారు.

మనం ఒక్కటి తలిస్తే పార్టీ మరోకటి తలుస్తుందని అన్నారు. తానెందుకు కమల్ నాథ్ పేరును ప్రతిపాదించాల్సి వచ్చిందన్న విషయమై స్పందిస్తూ.. తాను కేవలం పార్టీ కార్యకర్తను మాత్రమేనన్నారు, పార్టీ నిర్ణయాలు అన్ని వేళలా మనకు అనుకూలంగా ఉండవని పేర్కొన్నారు. జీవితమంటే అదేనని నిర్వేదం వ్యక్తం చేశారు. పార్టీ తనను 35 ఏళ్లకే మంత్రిని చేసిందని చెప్పుకొచ్చారు. పార్టీకి అవసరమైన సమయంలో తాము కూడా త్యాగాలకు సిద్దంగా వుండాలని అన్నారు.

తనకోసం పార్టీ ఎంతో చేసిందన్న ఆయన.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 300 శాతం కష్టపడ్డానని పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు తాము తీసుకునేవిగా వుండవని పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి తాము పనిచేయాల్సి వుంటుందని అన్నారు. తనతో పాటు సచిన్ ఫైలట్ కూడా అటు ఎంపీలుగా కోనసాగుతూనే ఇటు తమతమ రాష్ట్రాల్లో ఎక్కువ సమాయాన్ని కేటాయించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించామన్నారు. అయితే పార్టీ నిర్ణయాలకు తాము కట్టుబడివుండాల్సిందేనని పేర్కోన్నారు. తామంతా పార్టీ కోసం శ్రమించేవారమేనని సింధియా చెప్పుకోచ్చారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles