ఉత్తరప్రదేశ్ రౌడీ మూకలను ఏరివేస్తున్నామని.. గ్యాంగ్ స్టర్లకు స్థానం లేకుండా చేస్తున్నామని ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా.. దుర్మార్గులు, దుష్టుల అఘాయిత్యాలకు దారుణాలకు మాత్రం అంతూపొంతు లేకుండా పోతోంది. యువతులు, మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇక ప్రభుత్వం మాత్రం మోరల్ పోలిసింగ్ టీమ్ లను ఏర్పాటు చేశామని చెబుతున్నా.. అక్కడి పరిస్తితుల్లో మాత్రం ఎలాంటి మార్పు కానరావడం లేదు. పోలీసులు ఏకంగా గుండాలపై ఎన్ కౌంటర్ చేసేందుకు మీడియాను వెంటబెట్టుకుని పోయినా.. పోకిరీలలో మాత్రం ఎలాంటి భయం కనిపించడం లేదు.
బీహార్ క్రమంగా గుండా రాజ్ పేరును పోగొట్టుకుంటున్న క్రమంలో, ఉత్తర్ ప్రదేశ్ మాత్రం ఆదే పేరును సొంతం చేసుకుంటుంది. లవ్ జీహాద్ లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలు అకాతాయి యువతను కట్టడి చేయడంలో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వేధింపులకు గురైన ఓ మహిళ తనకు వార్నింగ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన యువకుడు సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి దాడిచేసి, వివస్త్రను చేసి నడి బజార్లో పరుగులు పెట్టించాడు. ఉత్తరప్రదేశ్లోని భడోహి జిల్లా గోపీగంజ్ కోట్వాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఓ మహిళ బజారు నుంచి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె వార్నింగ్ ఇచ్చింది. దీంతో అవమానభారంతో అక్కడి నుంచి వెనుదిరిగిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. స్నేహితులు ముగ్గురిని వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు ఆమెను బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. వివస్త్రను చేసి వీధుల్లో పరుగులు పెట్టించాడు.
దుండగుల తనపై అఘాయిత్యం చేస్తారన్న భయంతో రోడ్లపై పరుగులు పెడుతున్న ఆమెను రక్షించేందుకు కనీసం మనిషన్న వాడు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మానవత్వం చచ్చిపోయింది. అకతాయిల చర్యలకు స్థానికులు హడిపోయారా.? అంటే అదేం కాదు. రక్షించండీ, కాపాడండీ అంటూ అర్థనాధాలు పెడుతూ నగ్నంగా పరుగులు పెడుతున్న అమె ఫొటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితుల చేతిలో గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more