ACB Raids On RWS Junior Assistant Diwakar's House జూనియర్ అసిస్టెంట్ కాదు.. తిమింగలమే..

Acb shocks on assets procured by rws junior assistant diwakar

Rural water supply (RWS) Junior assitant, rampalli diwakar, Rs 100 cr assets, Anti corruption bureau, west godavari, undrajavaram, crime

A Rural water supply Junior assitant rampally diwakar procured assets worth rupees 100 crores. The Anti corruption bureau officials shocked to see his assets who raided his house in west godavari district.

ITEMVIDEOS: జూనియర్ అసిస్టెంట్ కాదు.. తిమింగలమే..

Posted: 12/31/2018 11:56 AM IST
Acb shocks on assets procured by rws junior assistant diwakar

ఆయన పోస్టుకు మాత్రం సర్వసాధారణమైన జూనియర్ అసిస్టెంట్. అయితే ఆమ్యామ్యాలు స్వీకరించిడంలో మాత్రం పెద్ద అధికారులకు ఏం తక్కువకాడని.. తాను కూడా తిమింగలమేనని చాటుకున్నాడు. నెలకు యాభై నుంచి అరవై వేల రూపాయల జీతంతో ఆయన మహా అంటే ఎంత వెనకేసినా.. మహా అంటే కోటి రూపాయలు అస్తులు కూడపెట్టవచ్చు. కానీ ఈయన మాత్రం ఏకంగా వంద కోట్ల రూపాయలను కూడబెట్టి తన ఇంట్లో దాడి చేసిన ఏసీబీ అధికారులనే విస్మయానికి గురిచేశాడు.

ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల అక్రమార్జన సంపాదించిన జానియర్ అసిస్టెంట్ రాంపల్లి దివాకర్ పై పిర్యాదులు రావడంతో అలర్ట్ అయిన అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు చేయగా ఏకంగా వంద కోట్ల రూపాయల అస్తులు బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం రామకృష్ణనగర్ లోని గ్రామీణ నీటి సరఫరా విభాగం జూనియర్‌ అసిస్టెంట్‌ రాంపల్లి దివాకర్‌ ఇంట్లో ఏసీబీ అదనపు ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో  సోదాలు నిర్వహించారు. కేవలం ఐదేళ్లలోనే రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టాడని వెల్లడించారు.

ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు లావాదేవీలను బ్యాంకు ద్వారా కాకుండా నగదు మార్పిడి ద్వారానే చేసినట్లు గుర్తించామని ఆమె తెలియజేశారు. తణుకు మండలం వేల్పూరు, టీచర్స్‌ కాలనీ, రావులపాలెం ప్రాంతాల్ల దివాకర్ పేరుతో బిల్డింగులు ఉన్నట్టు సోదాల్లో బయటపడిందన్నారు. అలాగే గోపాలపురం మండలంతోపాటు వివిధ ప్రాంతాల్లోని పొలాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. దివాకర్‌ పేరు మీద 85 ఎకరాల భూమి, 19 ఇళ్ల స్థలాలు, 4 కార్లు, 50 కాసుల బంగారం, రెండు కిలోల వెండి సామాన్లు ఉన్నట్లు సోదాల్లో గుర్తించామని ఆమె చెప్పారు. ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, నగదు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఆమె వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles