SBI gives Good News to Account Holders ఖాతాదారులకు ఎస్బీఐ న్యూఇయర్ గుడ్ న్యూస్

Sbi s zero balance savings account interest rates benefits here

SBI BSBD account, SBI zero balance account, sbi zero balance account interest rates, sbi zero balance account rules, SBI zero balance salary account, SBI zero balance savings accounts

State Bank of India has announced a 2019 New Year bumper offer for its existing account holders. Today, India's largest bank, State Bank of India, has brought many new changes to its customers.

ఖాతాదారులకు ఎస్బీఐ న్యూఇయర్ గుడ్ న్యూస్

Posted: 01/03/2019 11:33 AM IST
Sbi s zero balance savings account interest rates benefits here

కొత్త ఏడాది సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు న్యూఇయర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఈ బ్యాంకు మినిమం బ్యాలెన్స్ పేరుతో వసూలు చేస్తున్న మొత్తం దాదాపుగా 18 వందల కోట్ల రూపాయలుగా నమోదు కావడంతో దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఇకపై దేశంలోని సామాన్యులకు భారతీయ స్టేట్ బ్యాంకు అనేక మార్పులతో ఒక కొత్త అకౌంట్ ను ప్రవేశపెట్టనుంది. దేశంలోని పేదలు, సామాన్యులతో పాటు ఎవరైనా ఈ అకౌంట్ ను తెరిచే అవకాశాన్ని కూడా కల్పించింది.

బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ పేరున కొత్త అకౌంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే ఎలాంటి కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) అకౌంట్ లో వుంచాల్సిన అవసరం లేదు. కనీసం ఎలాంటి వార్షిక చార్జీలు కూడా కట్టనవసరం లేదు. ఇక ఈ అకౌంట్ హోల్డర్లకు రూపే డెబిట్ ఏటీయం కార్డులు కూడా అందించడంతో పాటు దానికి కూడా ఎలాంటి చార్జీలు వర్తించవు.

ఇంటెర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో వుంటుంది. ఇక ఈ ఖాతాదారులు ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ సేవలకు కూడా ఉచితంగా జరుపుకోవచ్చు. ఇక ఈ ఖాతాలలో వున్న డబ్బుపై సాధారణ సేవింగ్స్ అకౌంట్లుదారులకు వర్తించిన వడ్డీ రేట్లే వర్తించనున్నాయని బ్యాంకు అధికారులు తెలిపారు.దీంతో పాటు పలు రకాల అకౌంట్లలో కూడా కస్టమర్లకు కొంత ఉపశమనాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రధానమంత్రి జనతా యోజన:
అంతే కాకుండా ప్రధానమంత్రి జనతా యోజన, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలలో ఇప్పుడు నిలువలు తప్పనిసరి అవసరము లేదు అంతే కాకుండా వీటికి ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరము లేదు.ఇక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపు 14 లక్షల మందికి ఎస్బీఐ వినియోపగదారులకి ఊరట కలిగింది.
 
మొబైల్ బ్యాంకింగ్:
ఇది ఇలా ఉంటే ఎస్బీఐ వినియోగదారులకి కొన్ని బ్యాంకింగ్ పరిమితుతులలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. మొబైల్ బ్యాంకింగ్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు అలాగే నగదు బదిలీ రూ.5000 దాటితే తప్పనిసరి ఓటీపీ(OTP) వస్తాయి.
 
ఏటీఎంలో:
ఇక ఎస్బీఐ ఏటీఎంలలో కూడా కొన్ని సవరణలు చేశారు అవి ఏంటి అంటే మనం ఏటీఎంలో డ్రా చేసే నగదు మొత్తం మీద ఎస్బీఐ ఏటీఎంలో అయితే ఐదు సార్లు ఇతర ఏటీఎంలలో అయితే మూడు సార్లు తీసుకోవచ్చు. ఇది నాన్-,మెట్రో ప్రాంతాలలో వర్తిస్తుంది ఇక మెట్రో సిటీలలో అయితే ఐదు సార్లు ఎస్బీఐ ఏటీఎంలో ఐదు సార్లు ఇతర బ్యాంకు ఏటీఎంలలో కూడా తీసుకోవచ్చు. ఇంతే కాకుండా మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ కి లింక్ చేయాలి. అలాగే చాలా ఈజీ ప్రాసెస్ తో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా క్రెడిట్ కార్డు పొందచ్చు దీనికి ఎలాంటి రుసుములు ఉండవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI BSBD account  SBI zero balance account  sbi  zero balance account  minimum balance  

Other Articles