యువతీయువకుల పరస్పర అంగీకారంతో సహజీవనం చేసిన నేపథ్యంలో ప్రేమ పూర్వకంగానే ఒక్కటై జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఇద్దరు పరస్పరం ప్రేమించుకుని ఒక్కటిగా వున్న సమయంలో ఇద్దరి మధ్య అంగీకారంతో జరిగే శృంగారం అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సహజీవనంలో అంగీకారంతో జరిగే శృంగారాన్ని వేరుగా, మహిళ పట్ల అమె అంగీకారం లేకుండా బలవంతంగా జరిగే ఘటనలను అత్యాచారంగా పరిగణించాలని న్యాయస్థానం పేర్కోంది.
ఇటువంటి సందర్భాల్లో బాధితురాలు ఫిర్యాదు చేస్తే కోర్టు చాలా జాగ్రత్తగా ఆచూతూచి కేసును పరిశీలించాలని సూచించింది. మహారాష్ట్రకు చెందిన ఓ నర్సు డాక్టర్‌పై వేసిన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. సహజీవనం చేస్తున్న పురుషుడు తప్పనిసరి పరిస్థితుల్లో భాగస్వామిని వివాహ మాడనంత మాత్రాన అప్పటి వరకు వారి మధ్య ఉన్న సంబంధాన్ని రేప్ గా పరిగణించలేమని స్పష్టం చేస్తూ జస్టిస్ ఏ.కె.సిక్రి, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారానికి, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. భర్త చనిపోయిన తరువాత ఆ నర్సు కొన్నాళ్లుగా ఆ డాక్టర్ తో ప్రేమలోపడి అతనితో సహజీవనం చేస్తోందని, వారిమధ్య ఇష్టపూర్వక శృంగారం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. ఇటువంటి కేసుల్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే, నిందితుని మాయలో ఆమె పడిపోయిందని కాకుండా, ఆ వ్యక్తి నిజంగా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేక కోరిక తీర్చుకునేందుకు తప్పుడు మార్గం ఎన్నుకున్నాడా?, అతని తీరులో దురుద్దేశం ఏదైనా ఉందా? అన్న అంశాలను కూలంకుషంగా పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more