నిన్నటి తరం సినీహీరోయిన్ భానుప్రియ సహా అమె సోదరుడిపై పోలీసు కేసు నమోదూంది. బాలకార్మిక చట్టానికి తూట్లు పోడిచిన కారణంతో పాటు మైనర్ బాలికలతో దురుసుగా ప్రపర్తించారన్న నేరాభియోగాలపై అంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తెను బానుష్రియ అమె సోదరుడు అక్రమంగా నిర్భంధించారన్న బాధితురాలి తల్లి పిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్నాలుగేళ్ల తన కూతురు సంధ్యను ఇంట్లో పనులు చేయడం కోసం, అసరాగా వుంటుందని పనికి కుదర్చుకున్న భానుప్రియ.. అమెను తన ఇంటికి పంపించకుండా అక్రమంగా నిర్భంధించారని అరోపించింది. కనీసం తన కూతురితో ఫోన్ లో కూడా మాట్లాడించకపోవడం అనుమానాలకు తావిస్తోందని బాలిక సంధ్య తల్లి ప్రభావతి అందోళన చెందుతోంది.
అంతేకాదు భానుప్రియ సోదరుడు తన కూతురిపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడి వుంటాడన్న అనుమానాలను అమె వ్యక్తం చేస్తోంది. ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకుతున్నాని.. అదే క్రమంలో తన కూతురు సంధ్యను కూడ భానుప్రియ వద్ద పనికి పెట్టానని ప్రభావతి చెబుతోంది. అయితే.. భాను ప్రియ తన కూతురు సంధ్యను తన ఇంటికి పంపించకపోవడంతో ప్రభావతి ఛైల్డ్ లైన్ 1098 సహాయం కోరింది. దీంతో.. ఛైల్డ్ లైన్ ప్రతినిధులు భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు ఛేశారు.
కాగా, తనపై నమోదైన ఫిర్యాదుపై సినీనటి భానుప్రియ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, సంధ్య అనే బాలిక సంవత్సరం నుంచి పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఆ బాలిక తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన మాట వాస్తవమని భానుప్రియ చెప్పారు. తమ ఇంట్లో నుంచి దాదాపు లక్షా 50వేల డబ్బును, బంగారాన్ని, కెమెరాను, ఐప్యాడ్‌ను దొంగిలించిందని ఆమె ఆరోపించారు.
తొలుత నిజం చెప్పలేదని, నిలదీసి అడిగితే నిజం చెప్పిందని తెలిపారు. ఆ అమ్మాయిని తీసుకెళ్లమని వాళ్ల అమ్మకు ఫోన్ చేశామని.. బాలిక దొంగిలించిన కొన్ని వస్తువులను ఆమె తిరిగి తీసుకొచ్చిందని భానుప్రియ చెప్పారు. మిగిలిన వస్తువులను తీసుకొస్తామని ఇంటికి వెళ్లిన బాలిక తల్లి చివరికి తమ పైనే కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. నిజం ఏంటో చెప్పేందుకే మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more