Baba Ramdev sparks row over population control జనాభా నియంత్రణకు బాబా రాందేవ్ కొత్త ఐడియా..?

Ramdev no voting rights for people with more than two children

baba ramdev,baba ramdev population control,population control,india,yoga guru baba ramdev,yoga guru ramdev,ramdev baba,voting rights,government jobs,baba ramdev controversy, politics

Yoga guru Ramdev, who has always expressed concern over controlling population in the country, has advised that the government should snatch away the voting rights of people who go for more than two children.

జనాభా నియంత్రణకు బాబా రాందేవ్ కొత్త ఐడియా..?

Posted: 01/24/2019 06:39 PM IST
Ramdev no voting rights for people with more than two children

యోగా గురువు బాబా రాందేవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో జనాభా నియంత్రణ సాధ్యం కావాలంటే.. ఇలా చేయాలని బోడి గుండుకు కోడిగుడ్డుకు లింకుపెట్టారు. ప్రజాస్వామదేశంలో ప్రజలకు హక్కుగా పరిణమించిన ఓటుహక్కుకు జనాభా నియంత్రణకు మెలికపెట్టారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో బీజేపి సహా ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇద్దరు పిల్లులు చాలునని అపకండీ అంటూ సందేశాలివ్వగా.. యోగాగురు మాత్రం తనదైనశైలిలో ఈ విషయంలో అగ్గిరాజేశారు.

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే వారికి ఓటుహక్కు తొలగించాలని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో జనాభాను నియంత్రించాలంటే.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకు ఓటు హక్కును తొలగించాలి. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు కూడా కల్పించకూడదని నిర్మోహమాటంగా చెప్పేశారు.

అది హిందువులు, ముస్లింలు ఎవరైనా సరే. అప్పుడే జనాభాను నియంత్రించగలం’ అని బాబా రాందేవ్‌ అన్నారు. కాగా.. రాందేవ్‌ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఒకరి కంటే ఎక్కువ మంది తోబుట్టువులు ఉండేవారికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించకూడదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఓటు హక్కును కూడా తొలగించాలంటూ ఆయన సూచనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles