Nation marches as one on 70th Republic Day: హస్తినలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. అకట్టుకున్న మహిళా సైనిక కవాతు

Republic day 2019 india displays military might cultural grandeur at rajpath

Republic Day,Republic Day 2019,Republic Day 2019 Live,Republic Day updates,Republic Day in 2019,Republic Day Date,Happy Republic Day,26 January,India Republic Day,India Republic Day 2019,republic day traffic advisory,republic day traffic

The ceremonial parade rolled down the majestic Rajpath with South African President Cyril Ramaphosa in attendance as the chief guest along with PM Narendra Modi, President Ram Nath Kovind among several other leaders.

హస్తినలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. అకట్టుకున్న మహిళా సైనిక కవాతు

Posted: 01/26/2019 10:08 AM IST
Republic day 2019 india displays military might cultural grandeur at rajpath

దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇండియా గేట్ వద్ద అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోవింద్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 70 ఏళ్ల భారత గణతంత్ర మహోత్సవానికి ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా హాజరయ్యారు. మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 శకటాలు ప్రదర్శించారు.

కశ్మీరి నజీర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు అశోక్ చక్రను ప్రధానం చేశారు. . రాష్ట్రపతి చేతుల మీదుగా నజీర్ భార్య ఈ పురస్కారం అందుకున్నారు. ఓ కశ్మరి ఈ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. 308 మంది సైనిక సిబ్బందికి శౌర్య పురస్కారాలు అందించారు. ఒకరికి అశోక చక్ర. ఇద్దరికి కీర్తి చక్ర పురస్కారాలు ప్రదానం చేశారు. రాజ్‌పథ్‌లో ఘనంగా నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా హాజరయ్యారు. చిన్నా పెద్ద అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మహిళా సైనిక శక్తి పరేడ్..

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ లో జరిగిన పరేడ్‌లో మహిళా సైనిక శక్తి నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తి మహిళా బృందం‌తో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించారు. మహిళలతో కూడిన అసోం రైఫిల్స్‌ బృందం పరేడ్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. వీరి బృందానికి మేజర్‌ కుష్బూ కన్వార్‌ నాయకత్వం వహించారు. పూర్తిగా మహిళలతో కూడిన పారామిలటరీ బృందం రాజ్ పథ్‌ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.

కార్ప్స్‌ ఆఫ్ సిగ్నల్స్ కు చెందిన కెప్టెన్‌ శిఖా సురభి పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డేర్ డెవిల్స్‌ బృందంలో భాగంగా పురుషులతో పాటు ఆమె చేసిన బైక్‌ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బైక్ పై నిలబడి అమె చేసిన అభివాదానికి రాజ్ పథ్ కరతాళధ్నులతో మార్మోగాయి. దీంతో పాటు సైనిక, నావికా దళ బృందాల్లో కూడా పలువురు మహిళా అధికారులు నాయకత్వం వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Republic day  Rajpath  President  Ramnath Kovind  Republic day celebrations  Indian women army  

Other Articles