ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరున కాలనీ వెలువడటం రాష్ట్ర రాజకీయాలలో సంచలనాలకు తెరతీసింది. కృష్ణా జిల్లా గుడివాడలోని కొమరవోలులో వెలసిన ఈ కాలనీ దేవాన్ష్ కాలనీగా నామకరణం చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రజానిధులతో నిర్మించిన కాలనీకి దేవాన్ష్ పేరును పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన ముఖ్యమంత్రి.. దానిని తన రాజకీయా వారసత్వంగా స్వాగతించి ప్రారంభోత్సవం చేయడం విమర్శలకు దారితీస్తోంది.
వివరాల్లోకి వెళ్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద ఇళ్లు లేని పేదలకు ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు కేటాయించారు అధికారులు. అయితే తమకు ఇళ్లను అందించినందుకు సంతోషంగా స్థానిక లబ్దిదారులందరూ కలిసి టీడీపీ ప్రభుత్వానికి రిటర్న్ గిప్ట్ ఇచ్చారు. అదేంటంటే ఆ కాలనీకి ముఖ్యమంత్రి మనవడు నారా దేవాన్ష్ కాలనీగా నామకరణం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. అ కాలనీ బోర్డును, కాలనీని చంద్రబాబ సతీ సమేతంగా వెళ్లి ప్రారంభించారు.
ఇదే విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో నిర్మించే కాలనీలకు జాతీయ, రాష్ట్రీయ నేతల పేర్లో లేదా ప్రముఖుల పేర్లో పెడితే బాగుంటుందని కానీ.. ఇలా అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారైన తన మనవడి పేరును పెట్టడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నలు కురిపిస్తున్నారు. వారసత్వ రాజకీయాలపై పెదవి విరిచే చంద్రబాబు.. తన మనవడు దేవాన్స్ తన రాజకీయ వారసుడని చాటడానికి ఎందుకు తొందరపడుతున్నారని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే కొమరవోలు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 2015లో దత్తత తీసుకున్నారు. దీంతో స్తానికులు చంద్రబాబు దంపతులపై ప్రేమతో ఇలా చేశారన్న వాదనలు తెరపైకి వస్తున్నా.. అభంశుభం తెలియని పసివాడిని అప్పుడే రాజకీయ విమర్శలకు దింపడం సబబు కాదని సొంతపార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్న విషయం. కనీసం కాలనీ బోర్డును చూసైనా చంద్రబాబు అక్షేపించాల్సిందని మరికొందరు వాదిస్తున్నారు.
మరోవైపు ఈ కాలనీకి ముఖ్యమంత్రి మనువడి పేరు పెట్టడంపై వైసీపీ మండిపడుతోంది. ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీకి ముఖ్యమంత్రి మనవవడి పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటున్నారు. గ్రామంలో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరిగితే.. తాము చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more