Pawan Kalyan calls for United protest గొంతెత్తకపోతే భావితారాలకు ఇబ్బందే: పవన్ కల్యాణ్

Former mp vundavalli arun kumar all party meet end without conclusion

Pawan kalyan, JanaSena, TDP, Somi reddy, IYR Krishna Rao, BJP, Anand Babu, TDP, Amarawati, Vijayawada, Roundtable meet, Vundavalli Arun Kumar, Vijayawada, all party meeting in Vijayawada, AP special category status, Jana Sena, CPI, TDP, YSRCP, politics

Former MP Vundavalli Arun Kumar holds an all-party meeting at hotel Ilapuram in Vijayawada. In the meeting the leaders to discuss the issues related to AP special category status, bifurcation promises, and on the central funds to the state.

ముగిసిన ఉండవల్లి అఖిలపక్ష భేటీ.. తీర్మాణాలు హుళ్లక్కు..

Posted: 01/29/2019 02:41 PM IST
Former mp vundavalli arun kumar all party meet end without conclusion

ఎవరెన్ని లెక్కలు చెప్పినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం తీవ్రస్థాయిలో అన్యాయం జరిగిందన్నది వాస్తవమని జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యంగస్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్ర విభజన జరిగిందని, ఇప్పుడు కూడా మరోమారు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం వుందని అన్నారు.

కేంద్రం నుంచి ఎంత మేర నిధులు రావాలన్న దానిపై కూడా పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వున్నాయని అయన అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు కలసి గళమెత్తాలని ఆయన అన్నారు. భావితరాల బంగారు భవిష్యత్తుకు రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు.

ఇకముందైనా రాజకీయాలకు తావులేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగా ముక్తకంఠంతో ప్రశ్నించగలిగితేనే.. భవిష్యత్తులో భావితరాలకు ఇలాంటి అన్యాయం జరగదని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నింటికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆ తరువాతే రాజకీయ లబ్ది అని ఆయన అన్నారు.

అయితే రాష్ట్రానికి ఎంతమేర నిధులు రావాలన్న విషయంలో పార్టీలలో భిన్నాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో సమావేశానికి హాజరైన బీజేపి నేత, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిధులు ఎన్ని అన్న విషయంపై ఒక నిర్థారణకు రాలేమని అన్నారు. కేంద్రాన్ని పార్టీ చేసి.. వారి నుంచి అభిప్రాయం పోందిన తరువాతే దీనిపై స్పష్టత వస్తుందని తాను ఇదివరకే చెప్పానన్నారు.

ఎన్నికల్లో పార్టీల పరంగా ఒకరితో ఒకరు తలపడినా... ఆ తరువాత మాత్రం రాష్ట్రం కోసం అందరూ ఒకటిగా పని చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తన ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు వివిధ అంశాలపై ఏకాభిప్రాయానికి రాకుండానే సమావేశం ముగింసింది. దీంతో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి... ఏపీ విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని అన్నిపక్షాలు వ్యాఖ్యానించాయని అన్నారు. విభజన విషయంలో తామేమీ చేయలేకపోయినా... రాష్ట్రానికి సంబంధించిన హక్కులను సాధించుకోవడంలో మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన సూచించారు.

తాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసిన ఉండవల్లి... రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించాలన్నదే తన అభిమతమని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కల విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాను అందరి అభిప్రాయాలను గౌరవిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా... రాష్ట్ర హక్కుల కోసం పోరాడితేనే ప్రయోజనం ఉంటుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు తమ వ్యాపారాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోరనే భావన ఢిల్లీ పాలకుల్లో ఉందని... ఆ రకంగా వ్యవహరించకూడదని అన్నారు. ఈ సమావేశానికి బీజేపీ హాజరవుతోందనే కారణంగా సీపీఎం పార్టీ ప్రతినిధులు రాలేదని... టీడీపీతో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేదనే కారణంగా వైసీపీ రాలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. ఈ సమావేశం విజయవంతమైందని... ఇందుకు సహకరించిన నాయకులతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌కు ఉండవల్లి ధన్యవాదాలు తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  JanaSena  TDP  Vundavalli Arun kumar  IYR Krishna Rao  BJP  Anand Babu  TDP  Amarawati  Vijayawada  politics  

Other Articles