కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించడం రైతులను అవమానించడమేనని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రజలకు అకౌంట్లలో రూ.15 లక్షల రూపాయాలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
రైతులపై ప్రేమ కేవలం ఎన్నికల ముందే కలిగిందా.? గత ఐదేళ్లుగా వారిని కనీసం పట్టించుకకుండా వదిలేశారని విమర్శించారు. దేశంలోని రైతులందరూ హస్తినకు వచ్చి మరీ తమ నిరసన తెలిపినా పట్టని ప్రభుత్వం.. కేవలం ఎన్నికల ముందు మాత్రం వారికి తాయిలం ప్రకటించారని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం అనంతరం.. రాహుల్ ట్వీట్ చేశారు. రైతుల జీవితాలను మోదీ సర్కారు నాశనం చేసిందని ఆరోపించారు. దీంతో ఆయన ట్విట్టర్ ద్వారా ఈ మేరకు స్పందించారు.
‘డియర్ నోమో (నరేంద్ర మోదీ). ఐదేళ్ల మీ అసమర్థత, అహంకారం రైతుల జీవితాలను నాశనం చేసింది. రైతులకు రోజుకు కేవలం రూ.17 ఇవ్వడమంటే వారిని పూర్తిగా అవమానించడమే’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధానిగా మోదీకి ఇదే చివరి బడ్జెట్ అని రాహుల్ జోస్యం చెప్పారు. ఎన్నికల ముందు మోదీ ప్రకటించిన గారడీల బడ్జెట్ అని విమర్శించారు. ప్రధాని మోదీని బీజేపీ నేతలు ‘నమో’గా సంబోధించే విషయం తెలిసిందే. రాహుల్ ఈ పేరును కూడా ఎద్దేవా చేస్తూ ‘నోమో’ అని పేర్కొనడం గమనార్హం. ఎన్నికల తర్వాత కేంద్రంలో మోదీ ఉండరనేది రాహుల్ ఉద్దేశం కావొచ్చు.
Dear NoMo,
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2019
5 years of your incompetence and arrogance has destroyed the lives of our farmers.
Giving them Rs. 17 a day is an insult to everything they stand and work for. #AakhriJumlaBudget
కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రజలను మోసగించేలా ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఓ వైపు స్కిల్ ఇండియా అంటూనే ఈ బడ్జెట్ కు సంబంధించి నైపుణ్యాభివృద్ధి రంగంలో కోతలు విధించారని అమె అరోపించారు. కేంద్రం తమ పథకాలనే కాపీ కొట్టిందని, పశ్చిమబెంగాల్ లో తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కొత్తగా ప్రకటించిందని విమర్శించారు.
సమాఖ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర పథకం అని చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’, పశ్చిమ బెంగాల్ లో ముందు నుంచే అమల్లో ఉందని, ఆరోగ్య పథకం కింద రూ.5 లక్షల వరకు అమలు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రాలు చేసిన మంచిని కూడా కేంద్ర ప్రభుత్వం తమ గొప్పలుగా చెప్పుకుంటోందని, మోదీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more