పురుషాధిక్య సమాజంలో ఆడది అంగడి వస్తువుగా మారుతుంది. మహిళలు, యువతులు, పిల్లలు అన్న తేడా లేకుండా వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. బుగ్గ చిదిమితే పాలుగారే చిన్నారులను చూసినా మగమృగాలు వారిపై తెగబడుతున్నారు. మహిళలకు ఎక్కడికెళ్లిన వారి భద్రతే ప్రశ్నార్థకంగా మారుతొంది. స్కూలుకెళ్లినా, కాలేజీకెళ్లినా, మార్కెట్ కెళ్లినా.. వారు తిరిగివచ్చే వరకు ఇంట్లోకి వారికి అందోళన మాత్రం తప్పదు. అలా తయారయ్యాయి పరిస్థితులు.
ఇక ఎక్కడైనా వారు ఒంటరిగా వున్నారని తెలిస్తే పది మందికి మంచిచెడులు చెప్పేవాడు కూడా అఘాయిత్యాలకు పాల్పడుతూ అడ్డంగా బుకవుతున్నారు. నింగిపైనే కాదు ఆకాశంలో విహరించినా వారి బుద్ది మాత్రం గడ్డి కరుస్తుంటుంది. నింగి నేలా నీరు అన్న తేడా లేకుండా మహిళకు భద్రత కరువువుతుంది. తాజాగా బెంగళూరు-హైదరాబాద్ విమానంలో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెంగళూరు నగరంలో పీజీ చదువుతున్న 25 ఏళ్ల యువతి భోపాల్ నుంచి హైదరాబాదుకు వచ్చింది. విమానంలో విద్యార్థిని నిద్రపోతుండగా పక్క సీటులో ఉన్న ప్రయాణికుడు తనను తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించాడు. దీంతో నిద్ర లేచిన యువతి లైంగిక వేధింపులపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారి సూచన మేరకు విమానం ల్యాండ్ అయిన తర్వాత శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 354బి కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more