Naga Babu New Political Message through Funny Skit ఫన్ని స్కిట్ తో నాగబాబు మరో పోలిటికల్ మెసేజ్..

Mega brother naga babu new political message through funny skit

Naga Babu Political Message through funny skit, Mega brother Naga Babu, Naga Babu funny skit, Naga Babu political message, naga babu on 2019 elections, New Political Message, Funny Skit, Jabardasth, Andhra Pradesh, government, Opposition, Politics

Naga Babu Political Message to the people of Andhra Pradesh through funny skit. This skit showcases about 2019 elections and he conveys the message by saying 2019 Elections will be the battle for India's Soul.

ITEMVIDEOS: ఫన్ని స్కిట్ తో నాగబాబు మరో పోలిటికల్ మెసేజ్..

Posted: 02/02/2019 04:03 PM IST
Mega brother naga babu new political message through funny skit

మెగా బ్రదర్, నటుడు, జబర్దస్త్ షో న్యాయనిర్ణేత నాగబాబు.. మై ఛానల్ నా ఇష్టం పేరుతో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలను జాగృతం చేస్తున్నారు. అయితే దీనిని జాగృతం అని చెప్పడం కన్నా తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి అనుకూలంగా తన వంతుగా ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న అధికార, ప్రతిపక్ష పార్టీపై ఎక్కుపెట్టిన ఆయన వారు అవినీతిలో ఎంతటి ఘనాపాటీలో ప్రజలకు సెటైరికల్ గా స్కిట్ ద్వారా తెలియజేశారు.

జబర్దస్త్ స్కిట్ లు చూసీ చేసి ఆయనపై కూడా ఆ ప్రభావం పడిందేమోగాని ఇటీవల సినీనటుడు బాలకృష్ణపై పరోక్షంగా ఓ స్కిట్ చేసిన నాగబాబు తాజాగా ‘అంతా నా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో మరో వీడియో వదిలారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ ‘నేను నా అవినీతి’ అనే కామెడీ స్కిట్‌ని రిలీజ్ చేశారు. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ‘ఎంతైనా జబర్దస్త్ వాళ్లం కదా.. అందుకు ఓ చిన్న చిన్న స్కిట్ చేస్తున్నాం అని.. అయితే ఈ స్కిట్‌కి పేరు పెట్టలేదు కంటెంట్ నాని పేరే మీది.. ఈ స్కిట్ చూసి చివర్లో మీరే పేరు పెట్టాలని కామెడీ పండిస్తూ.. స్కిట్ వదిలారు.

ఇందులో అధికారం పక్ష నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ‘నేను నా అవినీతి’ అనే టాపిక్ ఇచ్చి నాగబాబు టీచర్ అవతారంలో వాళ్లిద్దరికీ ఎగ్జామ్ పెట్టారు. ఈ ఎగ్జామ్ 2019 ఎన్నికల్లో చాలా కీలకం అని.. ఇందులో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటూ ఎగ్జామ్ పెట్టడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుడు పోటీ పడి మరి పరీక్ష రాయడం.. ఎడిషన్ల మీద ఎడషన్లు తెగ రాయడాన్ని ఇందులో చూపించారు. అయితే చివర్లో మిగిలిన ఒక్క ఎడిషన్ పేపర్ కోసం పోటీపడి దాన్ని చింపేయడం లాంటివి ఫన్నీగా చూపించారు.

మొత్తానికి జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్‌గా ఏళ్లతరబడి చేస్తున్న నాగబాబు ఆ కామెడీ ఫ్లేవర్‌ను బాగా వంటపట్టించుకున్నట్టు ఉన్నారు. అందుకే బబర్దస్త్ స్థాయిలో కామెడీ పండించేందుకు అదే సందర్భంలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఇన్ డైరెక్ట్‌గా విమర్శలు గుప్పిస్తూ.. తమ్ముడి పవన్‌కి చేతనైన సాయం చేస్తున్నారు అన్న నాగబాబు. అయితే జబర్దస్త్ కామెడీ షోలో పండినంతగా ఈ స్కిట్‌లో పెద్దగా పస లేనట్టే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Babu  New Political Message  Funny Skit  Jabardasth  Andhra Pradesh  government  Opposition  Politics  

Other Articles