Marauding leopard released in Hoshiarpur forest జలంధర్ వాసులను పరుగులు పెట్టించిన చిరుత

Leopard that strayed into jalandhar village set free in natural habitat

Jalandhar leopard video, Wildlife in India, Leopard scare, Punjab leopard scare, animal human conflict, Marauding leopard, Hoshiarpur forest, Hoshiarpur, jalandhar, Punjab

Four people were injured in Jalandhar district’s Lamma Pind in Punjab after a stray leopard made its way into a residential area of the village.

ITEMVIDEOS: జలంధర్ వాసులను పరుగులు పెట్టించిన చిరుత

Posted: 02/02/2019 05:57 PM IST
Leopard that strayed into jalandhar village set free in natural habitat

అభయారణ్యాల్లో ఉండాల్సిన వన్యప్రాణులను మనుషులు తమ అవసరాల కోసం కబలిస్తుంటే.. వాతావరణ కాలుష్యంతో జీవనాధారమైన ఆహారాన్ని కూడా తుదిమేస్తన్న క్రమంలో అవి జనరాణ్యంలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరీకరణ పేరుతో అడువులు మధ్య ఇళ్లు తయారవుతుంటే.. అహారం కోసం వన్యప్రాణులు అరణ్యాలను వదిలి జనవాసాల మధ్యకు వస్తున్నాయి.

తాజాగా, పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. జనాలపై పంజా విసురుతూ భయబ్రాంతులకు గురిచేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ అటవీ ప్రాంతం నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించిన చిరుత జలంధర్‌లో సమీపంలోని లంబా పిండ్ గ్రామంలోకి చొరబడింది. చిరుతను పట్టుకోడానికి ఇద్దరు వ్యక్తులు వలను వేసినా అది చిక్కుకోలేదు. వారిపై దాడి చేస్తూ వీధుల్లో పరుగులు పెట్టింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

చివరకు అటవీ అధికారులు ట్రాంక్విలైజర్‌ గన్‌‌తో చిరుతను షూట్ చేశారు. దీంతో మత్తులో జారుకున్న చిరుతను బోనులో బంధించి.. చాట్‌బిర్ జూకు తరలించారు. ఈ జనవరి 31న చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలపై చిరుత పులి దాడి దృశ్యాలను మీరు వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles