Encounter in Bihar's Muzaffpur in broad daylight పట్టపగలు బస్టాండులో పోలీసుల ఎన్ కౌంటర్.. గ్యాంగ్ స్టర్ మృతి

Former rjd mp mohammad shahabuddin s nephew shot dead in bihar caught on tape

Bihar shootout, caught on tape, Criminal, crime in bihar, murder attempt, crime in bihar latest, bihar police, muzaffarpur latest, police, gangster, encounter, muzaffarpur, day light, crime

One criminal has been killed and the other managed to escape after a shootout in Bihar's Muzaffarpur. The encounter was caught on camera after local police were called in following a failed murder attempt of local transporter.

ITEMVIDEOS: పట్టపగలు బస్టాండులో పోలీసుల ఎన్ కౌంటర్.. గ్యాంగ్ స్టర్ మృతి

Posted: 02/02/2019 06:49 PM IST
Former rjd mp mohammad shahabuddin s nephew shot dead in bihar caught on tape

గుండారాజ్ గా పేరొందిన బీహార్ రాష్ట్రంలో క్రమంగా గుండాలు, రౌడీలకు చెక్ పెడుతూ వచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో క్రమంలో గుండారాజ్ అన్న పేరును కొల్పోతుందీ రాష్ట్రం. అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా తాను ఇంకా గుండానే అంటూ గుండాయిజం చేస్తున్న ఓ గ్యాంగ్ స్టర్ ను పోలీసలు పట్టపగలు చుట్టుముట్టి.. ప్రజలంతా చూస్తుండగా లైవ్ ఎన్‌కౌంటర్ చేశారు.

కాగా, ప్రజల ఎదురుగా ఇంతటి భయానక వాతావరణం సృష్టించిన పోలీసులపై కొందరు మానవతావాదులు మాత్రం మండిపడుతున్నారు. అయితే గ్యాంగ్ స్టర్ తో విసిగివేసారిన ప్రజలు మాత్రం పోలీసలకు వెన్నదన్నుగా వాఢ్ని కాల్చేయండీ అంటూ నినదించారు.ముజఫర్ పూర్‌ బస్టాండ్ లో ఆగివున్న బస్సులో నక్కిన క్రిమినల్‌ను పోలీసులు మట్టుబెట్టారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓ ముఠాకు చెందిన పది మంది నేరగాళ్లు బస్సులో కూర్చున్న కుందన్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ బస్సులోని ప్రయాణికులు భయంతో బస్సు దిగి పరుగులు పెట్టారు. ఈ సమాచారం తెలియగానే అక్కడే పహారా కాస్తున్న సాయుధ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

పారిపోతున్న ఓ నేరగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులో నక్కిన ఇంకో నేరగాడు లొంగిపోకుండా పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు అతనిపైకి ఎదురు కాల్పులు జరిపారు. బస్సు అద్దం పగలగొట్టి మరీ నేరగాడిని షూట్ చేశారు. దీంతో ఆ నేరగాడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్ జరుగుతున్న సమయంలో ‘‘వాడిని చంపేయండి.. చంపేయండి’’ అంటూ జనాలు కేకలు పెట్టడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar shootout  police  gangster  encounter  muzaffarpur  day light  Crime  

Other Articles