Linkage of PAN with Aadhaar is mandatory: SC ఐటీ రిటార్న్స్ చేయాలంటే.. ఆధార్.. పాన్ కార్డు లింక్ తప్పనిసరి..

Linkage of pan with aadhaar is mandatory for filing i t return supreme court

Supreme Court, Aadhaar card, Aadhaar number, PAN card, permanent account number, Delhi High Court. Income Tax, IT Returns

The Supreme Court has said that linkage of PAN with Aadhaar is mandatory for filing of Income Tax returns. The court was hearing the government’s plea against a Delhi High Court order allowing the respondent to file it returns for 2018-’19 without linking both.

ఐటీ రిటార్న్స్ చేయాలంటే.. ఆధార్.. పాన్ కార్డు లింక్ తప్పనిసరి..

Posted: 02/06/2019 04:06 PM IST
Linkage of pan with aadhaar is mandatory for filing i t return supreme court

ఆధార్ కార్డును బ్యాంకు అకౌంట్లతో, టెలికాం సంస్థలు జారీ చేసే మొబైల్ నెంబర్లతో లింక్ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎవరైనా మీ ఆధార్ నెంబరును కోరితే వారికి కోటి రూపాయల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే కొత్త చట్టాని కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో సంచలన తీర్పును వెలువరించింది.

ఆదాయ పన్ను (ఐటీ) రిటార్న్స్ దాఖలు చేయాలంటే ఆధార్ కార్డును పాన్ కార్డు లింక్ చేయక తప్పదని కూడా తెలిపింది. దీంతో ఐటీ రిటార్న్స్ ధాఖలు చేసేవారికి ఆధార్ కార్డుతో ఫ్యాన్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన దేశ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని వెలువరిచింది.

గడచని అర్థిక సంవత్సరానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు శ్రీయా సేన్, జయశ్రీ సత్పుటేలు ఆదాయ పన్ను రిటార్న్స్ ను ఎలాంటి ఆదార్ నెంబరును తెలిపకుండా దాఖలు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది, దీంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆదాయశాఖ వాటిని స్వీకరించింది. కాగా ఈ ఏడాది కూడా ఐటీ రిటార్న్స్ దాఖలు చేయడానికి అభ్యంతరం తెలిపిన ఐటీ శాఖ.. ఈ విషయంలో మరోమారు సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

దీంతో ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరి అని తీర్పును వెలువరించింది. గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు.. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వెలువరించిందని చెప్పింది. అప్పట్లో ఆధార్ అనుసంధానం విషయమై కేసు న్యాయస్థానంలో వున్నందున తీర్పు అలా వచ్చిందని, ఆ తరువాత న్యాయస్థానం ఆదాయపన్నుశాఖ సెక్షన్ 139ఏఏ సమర్థించిన విషయాన్ని వెలువరించి.. ఈ నేపథ్యంలో ఐటీ ప్రభుత్వశాఖ కాబట్టి.. ఇక ఆధార్ పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles