AP gives 5% reservation to Kapusకూన నిలదీస్తే.. మంత్రులకు చెమటలు.. కాపు రిజర్వేషన్ బిల్లుకు అమోదం..

Ministers flurry to answer kuna ravi kumar questions on bc sub plan

Indian society, India, Telaga, Kapu, Balija, Economically Backward Class, Andhra Pradesh, Indian family names, R. Krishnaiah, Backward Caste Welfare Minister, K Acchennaidu, Munnuru Kapu, kuna ravi kumar, Caste Welfare Minister, state government, Politics

The Andhra Pradesh state assembly passed a Bill to provide five per cent reservation to the Kapu, Telaga, Balija and Ontari communities, and another five per cent reservation to economically weaker sections.

కూన నిలదీస్తే.. మంత్రులకు చెమటలు.. కాపు రిజర్వేషన్ బిల్లుకు అమోదం..

Posted: 02/08/2019 11:36 AM IST
Ministers flurry to answer kuna ravi kumar questions on bc sub plan

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమ అధికార పక్షం.. ఒకప్పటి మిత్రపక్షమై బీజేపి తప్ప ఇతర పార్టీలేమీ లేని తరుణంలో.. జరిగిన సమావేశాల్లో తమ పార్టీకి చెందిన సభ్యుడు అడిగిన ప్రశ్నలతో మంత్రులకు ముచ్చెమటలు పట్టాయి. తమ ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పలేక.. వారిచ్చిన సమాధానంలో క్లారిటీలేక మంత్రులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ సన్నివేశం పార్టీలు, ప్రభుత్వాలను పక్కనబెడితే.. అసలు అసెంబ్లీలో శాసనసభ్యులు ఎలా వుండాలి.. వారికి కావాల్సిన సమాధానాలను తెలుసుకునే క్రమంలో ఎలా ఖచ్చితత్వంలో వ్యవహరించాలన్న విషయం తెలుపుతుంది.

ఈ అంశంలో మంత్రినే.. ఎమ్మెల్యేలు నిలదీసిన ఆసక్తికర పరిణామం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది. బీసీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా.. ప్రభుత్వ విప్ కూన రవికుమార్.. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్‌లోని నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తారా? లేదంటే రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా? అని విప్ కూన ప్రశ్నించగా.. జనాభా ప్రాతిపదికన ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పారు.

అచ్చెన్న సమాధానంలో క్లారిటీ లేదంటూ రవికుమార్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. దీనికి స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా మద్దతు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఒకేసారి ప్రతిపక్ష పాత్ర పోషించారు. రవికుమార్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రవణ్ కూడా డిమాండ్ చేశారు. అంతా ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించడంతో అచ్చెన్నాయుడు ఉక్కిరి బిక్కిరయ్యారు.

కాపు రిజర్వేషన్ బిల్లుకు అమోదం:-

కాపు రిజర్వేషన్ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టిన తీర్మానంపై సభలో చర్చ జరిగింది. ఈ బిల్లును ఎమ్మెల్యేలంతా సమర్థించగా.. సబ్‌ప్లాన్‌‌కు చట్టబద్ధత కల్పించాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతం కేటాయించాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అలాగే బీసీ సబ్‌ప్లాన్‌కు మూడో వంతు నిధులు కేటాయించాలని తీర్మానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Assembly  Kapu Reservation  Chandrababu  K Acchennaidu  kuna ravi kumar  Politics  

Other Articles