తెలుగుదేశం పార్టీ నుంచి వీడిపోతున్న నేతలకు, పార్టీలో వర్గాలతో, అగ్రనాయకులు అధిపత్యాలతో ఇన్నాళ్లు ఇబ్బందులను ఎదుర్కొన్నా.. ఇక చివరిక్షణంలో మాత్రం పొసగక పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు వారు పార్టీలోనే వుండేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలను దౌత్యానికి కుదిర్చినా ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇక లాభం లేదని తానే స్వయంగా నేతలతో చర్చించినా తాత్కాలికంగా వాయిదా పడుతుందే కానీ ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు.
తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత పార్టీని వీడటంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఆమంచి టీడీపీని వీడుతారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో, అధినేత చంద్రబాబు అయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మంత్రి శిద్ధా రాఘరావును ఆమంచి వద్దకు దూతగా పంపారు. అనంతరం, సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కృష్ణమోహన్ కలిసినా, ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి, తన లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపారు. అంతకు ముందు తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్‌ను కలిసి పార్టీలో చేరనున్నారు. చీరాల నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరడంతో ఆమంచి టీడీపీని వీడుతున్నట్టు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆమంచి, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చీరాలలో రెండు గ్రూపులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే పోతుల సునీతకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించిందనే అసంతృప్తి ఆమంచి వర్గీయుల్లో నెలకొంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత టీడీపీలో చేరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more