హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 16 ఆగస్టు 2017న నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ.. ఓటర్లకు డబ్బులు పంచారంటూ.. అప్పట్లో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె. శివకుమార్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై అప్పట్లో రాష్ట్ర ఎన్నికల అధికారి బాలకృష్ణ డబ్బులు పంచారన్న వార్తలను ఖండిచారు. బాలకృష్ణ తమ పార్టీ కరపత్రాలను పంచారని చెప్పారు.
అయితే బాలకృష్ణ బాహాటంగా డబ్బులు పంచుతూ మీడియాకు చిక్కిడంతో ఆ క్లిప్లింగ్స్ తో పాటుగా బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పిటిషనర్ పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల బెంచ్.. గతంలో ఏమైనా నోటీసులు జారీ చేశారా? అని ప్రశ్నించింది. పిటిషనర్ లేదని చెప్పడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, కర్నూలు కలెక్టర్ తోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.
అయితే ఆగస్టు 29 2017 నాడు న్యాయవాది, వైసీపీ నేత కె.శివకుమార్ న్యాయస్థానంలో పిటీషన్ వేయగా, ఇన్నాళ్లు న్యాయస్థానంలో పెండింగ్ లో వున్న పిటీషన్ తాజాగా తెరపైకి రావడం.. బాలకృష్ణకు నోటీసులను పంపడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాదిన్నర కాలం తరువాత ఈ కేసు తెరపైకి రావడంతో దీని వెనుక కూడా అదృశ్యశక్తుల ప్రభావం వుందా.? అన్న అనుమానాలను తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more