అసోంలో మరో విషాదం అలుముకుంది. విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 69కి చేరుకుంది. ఈ ఘటనలో ఒక్క గోలాఘాట్ లోనే 39 మరణాలు సంభవించాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన వేడుకలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఈ కలుషిత మద్యంసేవించి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పక్షం రోజుల కిందటే ఈశాన్య రాష్ట్రంలో కల్తీమద్యానికి సుమారు 100 మందికి పైగా బలైన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన నమోదు కావడం పెను విషాదాన్ని నింపింది.
గోలాఘాట్ లోని సల్మారా టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న కూలీలు తమకు కూలీ వచ్చిన సందర్భంగా వేడుక చేసుకున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే సంజు ఒరాంగ్ అనే వ్యక్తి నుంచి మద్యం తీసుకొచ్చారు. మద్యం సేవించిన కాసేపటికే నలుగురు మహిళలు కుప్పకూలారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటికి ఈ ఘటన మృతుల సంఖ్య 69కు చేరుకుంది. ఈ ఘటనలో మద్యం అమ్మిన వ్యక్తి సంజు ఒరాంగ్, అతడి తల్లికూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక టీ ఎస్టేటు తోటల్లో పనిచేసే వారికి వారానికోసారి కూలీలు ఇస్తుంటారు. ఇలా కూలీలు అందిన క్రమంలో వారంతా ఒక్కచోటుకు చేరకుని వేడుకలు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కోగ్లాసు మద్యం రూ.10, రూ.20లకు దుకాణ యజమాని సంజు అమ్మాడని దీంతో కొందరు స్థాయికి మించి మద్యం సేవించారని స్థానికులు పేర్కొన్నారు. అయితే మద్యం తాగిన తరువా వారంతా వాంతులు చేసుకున్నారని, కోందరు అక్కడే కుప్పకూలారని స్థానికులు తెలిపారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పరిమళ్ శుక్లాబైడ్యా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో అలసత్వం వహించినందుకు గానూ ఇద్దరు ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మద్యాన్ని రసాయనాల క్యాన్లో తీసుకురావడం వల్లే అది విషపూరితమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉన్న జూగీబారీ ప్రాంతంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఇందుకల్పా బోర్డాలోయ్, దేబాబోరాలను పోలీసులు అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more