తమిళనాడు తిరువూరులో ఓ మహిళ మహంకాళిగా మారింది. ఏకంగా మధ్యం షావు ముందుకు వచ్చి.. అక్కడికి వచ్చే మందుబాబులను బెంబేలెత్తించింది. ఇల్లు గడిపే మార్గాన్ని పట్టించుకోకుండా నిత్యమూ మద్యం తాగుతున్న భర్తను చూసిన ఆమె, వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మద్యం కొనగోలు చేస్తే కత్తులతో దాడి చేస్తానని మందుబాబులను హెచ్చరించింది. అంతేకాదు దుకాణం ముందు రెండు కత్తులతో వచ్చి ఎవరైనా మద్యం కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదని బెదిరించిన ఈ మహిళ.. తనను దాటి ఎవరైనా మధ్యం కొనుగోలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ అక్కడే కూర్చుంది.
అమెను దాటుకుని మధ్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు కూడా జంకారంటే అమె ఆగ్రహరూపం ఎంతలా వుందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, తిరుపూరులో ఈ ఘటన జరిగింది. స్థానికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న టాస్మాక్ దుకాణం ముందుకు వచ్చి అక్కడే కూర్చుంది. ఇల్లు గడిపే మార్గాన్ని పట్టించుకోకుండా నిత్యమూ మద్యం తాగుతున్న తన భర్త ప్రవర్తనను, తీరును చూసిన అమె వినూత్న రీతిలో నిరసన తెలిపింది. తన భర్తతో పాటు మందుబాబుల ఇళ్లలో పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని అమె చెప్పింది.
ఒక్కసారిగా మహిళ అలా చేయడంతో అక్కడికి వచ్చిన మందుబాబులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే దుకాణ నిర్వాహకులు పారిపోయారు. అనంతరం, కవితను స్టేషన్కి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా అనేక టాస్మాక్ దుకాణాలు వెలిసి, సమయపాలన లేకుండా విక్రయాలు సాగిస్తున్నాయని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more