Naresh elected as president of Maa association మా’ అధ్యక్షుడిగా నటుడు నరేష్ విజయం

Senior actor naresh elected as president of tollywood movie artists association

MAA Elections 2019-21, MAA President Naresh, jeevitha rajashekar, Sivaji Raja, Srikanth, Rajendra Prasad, tanish, tanikella bharani, rajeev kanakala, tollywood, movies, entertainment

In the MAA Elections for 2019-21, Naresh emerged victorious with more number of votes for President post where Sivaji Raja contested as opponet. Rajasekhar won against Srikanth, as Executive Vice President.

‘మా’ అధ్యక్ష రేసులో సీనియర్ నటుడు నరేష్ విజయం

Posted: 03/11/2019 11:02 AM IST
Senior actor naresh elected as president of tollywood movie artists association

తెలుగు చిత్రసీమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పీఠం కోసం సిట్టింగ్ అధ్యక్షుడు శివాజీ రాజీ- సీనియర్ నటుడు నరేశ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేశ్ విజయం సాధించాడు. ‘మా’లో మొత్తం 745 ఓట్లు ఉండగా ఈసారి అత్యధికంగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో శివాజీ రాజాపై 69 ఓట్ల అధిక్యంతో నరేష్ గెలుపోందారు. శివాజీరాజాకు 199 ఓట్లు, నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారి ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో నరేష్ తో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. జనరల్ సెక్రటరీగా రఘబాబుపై జీవిత గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్‌ నుండి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన నటి హేమ.. ఈసారి ఉపాధ్యక్షురాలి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం విశేషం. జాయింట్ సెక్రటరీగా బిగ్ బాస్ 1 విజేత శివ బాలాజీ గెలుపొందారు. క్రితం రోజు జరిగిన ఎన్నికలలో తొలి ఓటును నరేశ్ వేయగా, చివరి ఓటును పాతతరం హాస్యనటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నాడు.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వెల్లడించిన ఫలితాలలో నరేష్ ఫ్యానెల్ ఘనవిజయం సాధించింది. హీరో కృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడంతో జూబ్లీహిల్స్‌లోని ఫిలించాంబర్ సందడిగా మారింది. ప్రముఖులను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చాంబర్ వద్దకు చేరుకున్నారు. కాగా, అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేశ్, ప్రధాన కార్యదర్శిగా జీవితారాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల గెలుపొందారు.

గెలిచిన ఈసీ మెంబర్స్ వీరే:
1). అలీ
2). రవిప్రకాష్
3). తనికెళ్ల భరణి
4). సాయికుమార్
5). ఉత్తేజ్
6). పృథ్వి
7). జాకీ
8). సురేష్ కొండేటి
9). అనితా చౌదరి
10). అశోక్ కుమార్
11). సమీర్
12). ఏడిద శ్రీరామ్
13). రాజా రవీంద్ర
14). తనీష్
15). జయలక్ష్మి
16). కరాటి కళ్యాని
17). వేణుమాధవ్
18). పసునూరి శ్రీనివాస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles