ఇథియోపియాలో రాజధాని అబిస్ అబాబా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తంగా 157 మంది మృతిచెందాగా వారిలో నలుగురు భారతీయులలు కూడా వున్నారు. ఇక ఈ నలుగురిలో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరుకు చెందిన అమ్మాయి కూడా వుంది. తన అక్కను చూడటానికి వెళ్తూ ఈ విమానంలో ఎక్కిన అమె.. ప్రమాదంలో అసువులుబాసింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో 149 మంది ప్రయాణికులు కాగా, 8 మంది సిబ్బంది ఉన్నారు.
గుంటూరుకు చెందిన యువ డాక్టర్ నూకవరపు మనీషా సహా మొత్తం నలుగురు భారతీయులు ఉన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతుల రెండో కుమార్తె మనీషా గుంటూరు మెడికల్ కాలేజీలో నాలుగేళ్ల క్రితం మెడిసిన్ పూర్తిచేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కెన్యా రాజధాని నైరోబీలో ఉంటున్న మనీషా అక్క లావణ్య 10 రోజుల క్రితమే ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు అమెరికా నుంచి బయలుదేరిన మనీషా ముందుగా ఇథియోపియాకు చేరుకున్నారు.
అక్కడ నుంచి నైరోబీ వెళ్లేందుకు ఇథియోపియా ప్రభుత్వరంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్(ఈఏ)కు చెందిన బోయింగ్ 737-8 మాక్స్ విమానం ఎక్కారు. దేశ రాజధాని అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 8.38 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం 8.44 గంటలకు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత అడిస్ అబాబాకు దక్షిణాన 50కిలోమీటర్ల దూరంలో బిషోఫ్తు పట్టణ సమీపంలోని హెజెరె ప్రాంతంలో కుప్పకూలినట్లు గుర్తించారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన 157 మందిలో మనీషా కూడా ఉన్నారు. మనీషా తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే గుంటూరు నగరంలోని నవభారత్ నగర్లో స్థిరపడ్డారు. అయితే పెద్ద కుమార్తె గర్భవతి కావడంతో నెలరోజులుగా నైరోబీలోనే ఉంటున్నారు. వారి వద్దకు వెళ్తుండగానే మనీషా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మనీషాతో పాటు మనదేశానికి చెందిన వైద్య పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్ అన్నగేశ్, పర్యావరణశాఖ కన్సల్టెంట్ శిఖా గార్గ్ విమాన ప్రమాదంలో మృత్యువాతపడ్డారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more