ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్ సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్డు విడుదలైన క్రమంలో రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీలు హస్తిన బాట పట్టాయి. రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య ముదురుతున్న ఓట్ల తొలగింపు వ్యవహారం, డేటా చౌర్యం అంశాలు దేశ రాజధానికి చేరాయి. దాదాపుగా 7 లక్షల ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేసిన అంశంతో పాటు, డేటా చోరీ ఆంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఇవాళ ఫిర్యాదు చేసింది.
మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే.. డేటా చోరీ, ఫారం-7 అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు 'సిట్'లను ఏర్పాటు చేసింది. కాగా, టీడీపీ నేతలకు పోటీగా ఇటీవలే ఒక పర్యాయం సీఈసీ అధికారులను కలసిన వైసీపీ నేతలు ఇవాళ మరోమారు వారిని కలసి తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను అక్రమంగా సర్వేల పేరుతో తొలగించారని పిర్యాదు చేసింది.
ఇదిలావుండగా, డేటా చోరీ కేసులో కీలకంగా మారిన ఐటీ గ్రిడ్స్ కేసులో సీఈవో అశోక్ కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగగా, పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇప్పించాలని తెలంగాణ సర్కార్ కోరింది. కాగా, అశోక్ తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్ర ఇప్పుడే వివరణ ఇవ్వలేమంటూ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more