మీరెప్పుడైనా చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకొని రైల్వే టికెట్ క్యాన్సిల్ చేశారా? టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారా? మీకే కాదు... చాలామందికి ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేయడం ఓ పెద్ద సవాల్ అయితే... టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ పొందడం అంతకంటే పెద్ద సవాల్. పలుమార్లు టిక్కెట్ క్యాన్సిల్ అయినా డబ్బు తిరిగిపోందలేక చాలా మందే డబ్బులు పొగోట్టుకున్నారు.
చాలామందికి టికెట్ క్యాన్సిలేషన్ నియమనిబంధనలు తెలియక డబ్బులు పోగొట్టుకుంటారు. అందుకే ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ వీడియో విడుదల చేశారు. టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ వివరించారు. ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు నష్టపోకుండా చైతన్యపరుస్తోంది రైల్వే శాఖ. టికెట్ క్యాన్సలేషన్ విషయంలో రైల్వే శాఖ నియమనిబంధనలు ఇవే.
రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే...
ఫస్ట్ ఏసీ/ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్లపై రూ.240 కోత
2 ఏసీ/ఫస్ట్ క్లాస్ టికెట్లపై రూ.200 కోత
3 ఏసీ/ఏసీ చైర్ కార్/3ఏసీ ఎకనమీ క్లాస్ టికెట్లపై రూ.180 కోత
రైలు బయల్దేరడానికి 48 నుంచి 12 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే...
రిజర్వ్డ్ టికెట్లపై బుకింగ్ అమౌంట్‌పై 25 శాతం కోత
రైలు బయల్దేరడానికి 12 నుంచి 6 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే...
రిజర్వ్డ్ టికెట్లపై బుకింగ్ అమౌంట్‌పై 50 శాతం కోత
తత్కాల్ టికెట్ల క్యాన్సిలేషన్
తత్కాల్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. ఒకవేళ రైలు 3 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణికులు టికెట్ డిపాజిట్ రిసిప్ట్(TDR) ఫైల్ చేసి రీఫండ్ పొందొచ్చు.
టీడీఆర్ ఎలా ఫైల్ చేయాలి?
మొదట IRCTC వెబ్సైట్లో లాగిన్ చేయాలి.
‘my account’లో ‘my transaction’ పేజీలోకి వెళ్లాలి.
‘file TDR’ ఆప్షన్ ఎంచుకోవాలి.
టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో కారణం చెప్పాలి.
‘file TDR’ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఒకవేళ కౌంటర్లో టికెట్ బుక్ చేసినట్టైతే పీఎన్ఆర్ నెంబర్, ప్రయాణికుల వివరాలతో టీడీఆర్ ఫామ్ పూర్తి చేసి రీఫండ్ పొందొచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more