11 killed in Jammu and Kashmir road accident జమ్మూకాశ్మీర్ లో ఘోరప్రమాదం.. లోయలో పడిన కారు..

11 dead as suv falls into gorge in jammu kashmir s ramban district

jammu and kashmir, Jammu Kashmir accident, Jammu-Pathankot highway accident, kashmir accident, Ramban, Ramban district, SUV, suv fell into george, kashmir george suv, Crime

The SUV, carrying 15 passengers from Chaderkote to Rajgarh, rolled down into the over 500-feet-deep gorge when its driver lost control at Kunda nallah near Baglihar power house at 10.30 am, an official said.

జమ్మూకాశ్మీర్ లో ఘోరప్రమాదం.. లోయలో పడిన కారు..

Posted: 03/16/2019 08:05 PM IST
11 dead as suv falls into gorge in jammu kashmir s ramban district

జమ్ముకశ్మీర్ లోని రాంబన్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎస్ యూవీ అదుపుతప్పి లోయలో పడి 11 మంది మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందర్ కోట్‌ నుంచి 15 మంది ప్రయాణికులతో రాజ్ గఢ్‌ వెళ్తున్న ఎస్యూవీ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. కుందా నల్లా ప్రాంతంలో మూలమలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయింది.

దీంతో ఒక్కసారిగా వాహనం రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న 500 అడుగుల లోతులో పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. డ్రైవర్‌ సహా నలుగురు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని జమ్ముకు తరలించారు.

రాజ్ గఢ్‌ ప్రాంతంలోని ఘాట్‌ రోడ్డుల్లో వెళ్లే ఎస్యూవీల్లో ఏడుగురు ప్రయాణికులు మాత్రమే ఉండాలని ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించి డ్రైవర్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. అందువల్లే నియంత్రణ కోల్పోయి.. ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి రెస్కూటీమ్ లు వచ్చి సహాయకచర్యలు చేపట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir  accident  Jammu-Pathankot highway  Ramban  SUV  george  Crime  

Other Articles