తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్న సూక్తిని మర్చిపోయిన నేటి తరం నెటీ జనులు.. ఇతరులు. ప్రముఖుల తప్పులను మాత్రమే ఎలుగెత్తి చాటుతుంటారు. అయితే తాము కూడా పలు సందర్భాలలో తప్పులు చేస్తామని గ్రహించకుండా.. ఎదుటివారి తప్పులను బట్టి సామాజిక మాధ్యమాల్లో వారిని టార్గెట్ చేసి ట్రాల్ చేయడం నేటి యువతకు అలవాటుగా మారింది. అయితే ఎవరో ఒకరు పొరపాటునో గ్రహపాటునో పరాధ్యానంగానో తప్పులు చేస్తే వారిని టార్గెట్ చేయడం సముచితం కాదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.
అయితే పోరబాటు పదే పదే చేస్తున్న వారి విషయంలో కూడా ఈ విమర్శల పర్వం మరీ ఎక్కువగా వుంటుంది. ఇక రాజకీయ నేతలైతే వారిని అన్ని పక్షాల వారూ నెట్టింట్లో ఉతికి అరేస్తుంటారు. ఇప్పడు తాజాగా ఆంద్రప్రదేశ్ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ విషయంలోనూ అదే జరుగుతోంది. మంగళగిరిలో స్థానికంగా ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా తనకు సీటివ్వడంతో అక్కడ టీడీపీలో అసంతృప్తిని చల్లార్చడానికి వెళ్లిన చినబాబు తాను నోరు తెరిస్తే ఏం జరుగుతుందో జనానికి మరోసారి రుచి చూపించారు.
ఆయన మాట్లాడే తెలుగుపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతుండగా, తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ తడబడ్డారు. మంగళగిరిలో ప్రచారం చేస్తున్న లోకేశ్ రోడ్ షోలో మాట్లాడుతూ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వివేకా మరణంపై మాట్లాడుతూ.. ‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి..’ అంటూ ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
అక్కడితో ఆగని లోకేష్,, మంగళగిరిలో 1980 నుంచి టీడీపీ గెలవలేదని, తాను గెలుస్తానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఇక్కడే అసలు ట్విస్టుంది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే 1982వ సంవత్సరంలో అయినపుడు అంతకు రెండేళ్లు ముందుగానే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ఎలా సాధ్యం? అంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ పై నెట్ జనులు విమర్శలు చేస్తున్నారు. 1982లో పుట్టిన పార్టీ 1980లోనే ఎలా గెలుస్తుందో మేధావి చినబాబే సెలవియ్యాలంటూ లోకేశ్ ను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం లోకేష్ ను వెనకేస్తున్నాయి.
ఆయన 1980 దశకం నుంచి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలవలేదని అన్నారని, అయితే దాన్ని కూడా రాద్దాంతం చేసి.. బురదజల్లేందుకు విపక్షపార్టీలు చేస్తున్న కుట్రలో భాగమే నెట్టింట్లో ట్రాలింగ్ అని అంటున్నారు. పదే పదే ఇలాంటి చౌకబారు విమర్శలు చేసినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదని, ఇలాంటి ట్రాలింగ్ లతో తమ నేత నైతికస్థైర్యాన్ని దెబ్బతీయలేరని కూడా చెబుతున్నాయి. తమ నేత ప్రచారంలో ప్రజల నుంచి వచ్చిన ఆదరణను చూసే చౌవకబారు విమర్శలకు దిగుతున్నారని పేర్కోన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more