JSP allots Bhimavaram & Gajuwaka to Pawan Kalyan కన్ఫామ్: ఈ రెండు స్థానాల నుంచి పవన్ పోటీ

Pawan kalyan to contest from gajuwaka and bhimavaram

pawan kalyan, janasena, Pawan Kalyan general body meeting, pawan kalyan bhimavarm, pawan kalyan Bheemavaram. pawan kalyan gajuwaka, pawan kalyan two constituencies, andhra pradesh, politics

Jana Sena Party Chief Pawan Kalyan will be contesting two seats in his first ever time in the election fray. In the upcoming Assembly Elections in Andhra Pradesh, Pawan will contest from Bhimavaram in West Godavari and from the Gajuwaka constituency in Visakhapatnam.

కన్ఫామ్: ఈ రెండు స్థానాల నుంచి పవన్ పోటీ

Posted: 03/19/2019 01:36 PM IST
Pawan kalyan to contest from gajuwaka and bhimavaram

ఎన్నికల రణతంత్రంలో తనదైన బాటలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవర్ స్టార్ ఫవన్ కల్యాణ్.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో జనసేనాని పోటీ చేయనున్న రెండు స్థానాలపై తీవ్ర కసరత్తు చేసిన తరువాత ఎట్టకేలకు ఫైనల్ చేశారు. పశ్చిమ గోదావరిలోని భీమవరం నియోజకవర్గంతో పాటు విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నారు.

పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ద్వారా ఆయా నియోజకవర్గాలతో పాటు జిల్లాలపై కూడా కొంత ప్రభావం వుంటుందని దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల బరిలో వున్న పార్టీ అభ్యర్థులకు కలసివచ్చే అంశంగా జనసేన పార్టీ భావిస్తోంది. ఈ ఒక్క విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ తన సోదరుడు, మోగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా ఎన్నికలలో పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కూడా ఎన్నికల బరిలో దిగారు.

అయితే ప్రజారాజ్యం.. జనసేన పార్టీల జెండాలు, అజెండాలల్లో అనేక విధాల భావస్వారూప్యత వున్నా.. కేవలం రెండు స్థానాల్లో పోటీ చేసే అంశంలో మాత్రం అన్నబాటలో తమ్ముడు పయనిస్తున్నట్లు స్పష్టం చేస్తొంది. గాజువాక నుంచి పోటీ చేసే విషయంలో ఒక్క రోజు కిత్రమే క్లారిటీ వచ్చినా ఇక మరో సీటు విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఇవాళ సమావేశం తరువాత జనసేన పార్టీ పవన్ కల్యాణ్ పోటీ చేసే మరో స్థానం భీమవరం అని కన్ఫామ్ చేసింది. దీంతో అక్కడి జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  bhimavaram  gajuwaka  general body  andhra pradesh  politics  

Other Articles