ys jagan changes hindupuram MP candidate హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్పు.!

Ys jagan changes hindupuram mp candidate

YS Jagan, YSRCP, gorantla madhav, gorantla savitha, hindupuram mp candidate, andhra pradesh, politics

YSRCP president YS Jagan changes hindupuram MP candidate Gorantla Madhav and allocates ticket to his wife gorantla savita, as madhav has not recieved his releaving letter.

హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్పు.!

Posted: 03/23/2019 09:59 AM IST
Ys jagan changes hindupuram mp candidate

వచ్చే నెల 11న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో నామినేషన్ల గడువుకు ఇక కేవలం సోమవారం ఒక్కరోజు.. అదీనూ మధ్యాహ్నం మూడు గంటలవరకే మిగిలివుండటంతో.. ఇప్పటికీ పలు స్థానాల విషయంలో మార్పులు చేర్పులు చేపడుతున్న పార్టీలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకస్థానమైన హిందూపురంలో అభ్యర్థి మార్చింది.

ఇక్కడి లోక్ సభ స్థానం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్ ను బరిలోకి దించిన వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తాజా పరిణామాల నేపథ్యంలో అభ్యర్థిని మార్చింది. వైసీపీ అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తుందని పూర్తి నమ్మకంతో వున్న గోరంట్ల మాధవ్ కు జగన్ సీటును కేటాయించినా.. ప్రస్తుతం ఆయనకు తన సోంతశాఖ నుంచి షాక్ తగులుతూనే వుంది. అయితే ఈ క్రమంలో అచితూచి అడుగులు వేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఆయన అభ్యర్థిత్వాన్నికి బదులు ఆయన భార్యకు టికెట్ కేటాయిస్తూ బీఫామ్ ఇవ్వనుంది.

గొరంట్ల సవిత ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయనుంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలను ఆదేశించారు జగన్. గోరంట్ల మాధవ్ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని.. అభ్యర్థి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు నేతలకు. గోరంట్ల మాధవ్ పోలీసు శాఖలో సిఐగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తన పదవికి స్వచ్చంధ విమరణ చేశారు. ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయటంలో ఆలస్యం జరిగింది. ఆయన పదవీ విరమణను ప్రభుత్వం అంగీకరించలేదు.

దీంతో ఆయన హైకోర్టు, ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా.. ఆనకుకు తీర్పు అనుకూలంగా వచ్చింది. కోర్టు ఆదేశాలతో స్వచ్ఛంధ పదవీ విరమణను అంగీకరించిన పోలీస్ శాఖ.. రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేదు. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం. ప్రభుత్వ ఆఫీసులకు సెలవు. ఇక సోమవారం ఒక్క రోజే మిగిలి ఉంది. ఇక వేళ సోమవారం కూడా రిలీవింగ్ లెటర్ రాకపోతే.. అతను నామినేషన్ వేయటానికి అనర్హుడు. అప్పుడు పార్టీ అభ్యర్థి లేకుండా పోతారు.

ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జగన్.. మాధవ్ భార్య సవితను బరిలోకి దించుతున్నారు. ముందుజాగ్రత్తగా ఆమెకు బీఫాం ఇస్తున్నారు.
మార్చి 25వ తేదీ సోమవారం రిలీవింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తారు అనే టైం విషయంలో కూడా క్లారిటీ లేదు. నామినేషన్ దాఖలుకు సమయం 3 గంటల వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం మాత్రం 5 గంటలకు లెటర్ ఇచ్చే సమయం ఉంటుంది. దీంతో ముందు జాగ్రత్తగా గోరంట్ల మాధవ్ భార్య సవితను బరిలోకి దించుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  gorantla madhav  gorantla savitha  hindupuram mp candidate  andhra pradesh  politics  

Other Articles