రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తమ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న సినీ హీరో, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఇవాళ ఓ మెట్టు దిగివచ్చారు. మీడియా మిత్రులకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్షమాపణలు చెబుతూ దిగివచ్చాన బాలయ్య.. సెల్ పోన్ లో తనను చిత్రీకరిస్తున్న వారిని మీడియా ప్రతినిధులు అనుకోలేదని అని తెలిపారు.
అక్కడి పిల్లలపై పడి వీడియోలు తీస్తున్న వారిని కేవలం అల్లరి మూకలని భావించి మాత్రమే తాను వారిని వారించానని చెప్పారు. ఆ తరువాత ఈ విషయమై వివాదం పెద్దది కావడంతో తనకు వారు మీడియా ప్రతినిధులని తెలిసిందని అన్నారు. అయితే తాను వారిని మీడియా ప్రతినిధులని తెలిసి ఉద్దేశపూర్వకంగా వారిపై అగ్రహం వ్యక్తం చేయాలన్న ఉద్దేశ్యం తనకు ఏ కోశాన లేదని బాలకృష్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన ప్రకటనలో పేర్కోన్నారు. ఈ విషయంలో మీడియా మిత్రులకు తాను బాధ కలిగించి వుంటే క్షమాపణలు కోరుతున్నానని బాలకృష్ణ పేర్కోన్నారు.
అసలు జరిగిందేమిటీ.? హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీడియో జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. ప్రాణాలు తీస్తా జాగ్రత అంటూ హెచ్చరించారు. హిందూపురంలో బాలయ్య ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలకృష్ణ హిందూపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తల ఇంట్లో బోజనం చేసి వస్తుండగా, కొందరు పిల్లలు కాన్వాయ్ కు అడ్డుగా రావడంతో.. బాలయ్య సెక్యురిటీ సిబ్బంది వారిని పక్కకు లాక్కెళ్లారు.
ఈ వీడియోను ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి వీడియో తీశాడు. వెంటనే గమనించిన బాలయ్య అతడిపైకి దూసుకెళ్లారు. కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోను వెంటనే తొలగించాలని బెదిరింపులకు దిగారు. నరికి పోగులు పెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెలుసు.. కత్తి తిప్పడం కూడా తెలుసు అంటూ హెచ్చరించారు. బాలయ్య మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడాన్ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు మొబైల్ లో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన బాలకృష్ణ మీడియాకు క్షమాపణలు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more