భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అవినీతి కంపు కోడుతుంది.. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా అన్న మాటలు భీమవరంలోని ఆ పదివేల మధ్యతరగతి కుటుంబాలను విస్మయానికి గురిచేశాయి. అదేంటి వారి పార్టీనే జగన్ టార్గెట్ చేశారా.? అని భావించారంతా.? అయితే ఆయన ఆ విషయాన్ని వదిలి మిగిలిన విషయాలపై ప్రసంగించారు.
అహర్నిషలు కష్టపడి కడుపు కట్టుకుని తమ పిల్లల భవిష్యత్తు కోసం, కూతుళ్ల పెళిళ్ల కోసం రూపాయి రూపాయి పోగేసుకుని దాచుకున్న సోమ్మును.. దాచుకునేందుకు తమ చేజేతులా బ్యాంకులో వేస్తే.. బ్యాంకులోని డబ్బును దోచుకున్న వ్యక్తికి తమ పార్టీ నుంచి టెకెట్ ఇచ్చి మళ్లీ మాయమాటలు చెప్పి మోసం చేయ్.. అన్నట్లుగా అండనిచ్చారని ప్రశ్నలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రభుత్వాలు పథకాలు, ప్రాజెక్టుల పేర్లు చెప్పి లేక ఇసుక మాఫియానో లేక గనుల మాఫియా అవతారంలో దోచుకుంటే తమ డబ్బు ఏమీ పోవడం లేదని అ విషయాలపై అంతగా శ్రద్ద పెట్టరు. కానీ తాము కష్టించి సంపాదించిన డబ్బును దాచుకునేందుకు బ్యాంకులో వేస్తే దానినే దోచుకున్న వ్యక్తులను మాత్రం ఎటువంటి పరిణామంలోనే క్షమించరు. అది సామాన్యుడి కోణం. అయితే బాధితులకు తమ డబ్బును పంచినా.. సదరు వ్యక్తిపై వున్న అక్రోశం మాత్రం తగ్గదు.
ఎందుకంటే డబ్బు అయితే వస్తుందేమో కానీ ఆ డబ్బు పోయి.. తాము అనుభవించిన శారీరిక, మానసిక ఒత్తిడి వారిపై ఎంత ప్రభావం చూపుతుందో సామాన్యుడికే అర్థం అవుతుంది. ఆ భాదను అనుభవించిన వారు.. తమను బాధించిన వ్యక్తిని ఎలా క్షమిస్తాడు. అంతే బాధితులకు ఆ డబ్బును వడ్డీతో కలసి అణా పైసలతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసిన వ్యక్తులకు మాత్రం బాధితులు అండగా నిలుస్తారు.
అదే ఇప్పుడు భీమవరంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అవినీతి చేస్తుందని అరోపించిన వైసీపీ అధినేత జగన్ తమ భీమవరం అభ్యర్థి గ్రంధీ శ్రీనివాస్ అవినీతి చరిత్ర తెలిసే టికెట్ కేటాయించారా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక భీమవరం కో-అపరేటివ్ అర్భన్ బ్యాంకు పేరును మధ్యతరగలి ప్రజల నుంచి దోచుకున్న ప్రతీ పైసాను గ్రంధీ శ్రీనివాస్ తిరిగి చెల్లించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడం బాధితులకు వెయ్యి ఏనుగుల బలానిస్తే.. గ్రంధికి మాత్రం కోపం నశాలనికి ఎక్కుతుంది.
ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం జరిగిన అవినీతి గురించి ఇప్పుడు కొత్తగా వచ్చిన పవన్ కల్యాణ్ ప్రశ్నించడం రుచించని గ్రంధీ శ్రీనివాస్.. ఆయనకు తోడుగా నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రాఘురామకృష్ణంరాజు కలసి పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకున్నారని.. అందుకోసం ఎంతటి వ్యయ ప్రయాసలకైనా తాము సిద్దమని భీష్మించుకున్నారని జనసేన వర్గాలు అరోపిస్తున్నాయి. ఒకరు పరిశ్రమల పేరుతో డబ్బును దోచుకోగా, మరోకరు బ్యాంకులలో మధ్యతరగతి ప్రజలు దాచిన డబ్బును దోచుకున్న సోమ్ముతో ఓటుకు పది నుంచి ఇరవై వేల రూపాయలైనా వెచ్చించి గెలవాలని భావిస్తున్నారని పవన్ అభిమానుల అరోపణ.
భీమవరంలో శ్రీనివాస్ అవినీతి గ్రంధమేమిటనగా..
గ్రంధీ శ్రీనివాస్ వంశపారపర్యంగా ఎదిగిన నేత. ఆయన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు స్థానిక నాయకుడిగా మంచి పేరుంది. ఆయన మంచితనం, కృషి, పట్టుదలతో ఎదిగిన వ్యక్తి. దీంతో భీమవరంలోని కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకుకు ఆయనను బ్యాంకు డైరెక్టర్లు చైర్మన్ గా కూడా ఎన్నుకున్నారు. ఆయన ఈ బాధ్యతలను ఏకంగా 1995 వరకు నిర్వహించారు. వెంకటేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన గ్రంధి శ్రీనివాస్.. ఆ తరువాతి ఎన్నికలలో తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని కూడా పునికిపుచ్చుకుని బ్యాంకు చైర్మన్ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.
తండ్రి పేరులో వున్న మంచితనాన్ని వినియోగించుకోవడంతో శ్రీనివాస్ గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. స్థానికులు కూడా వెంకటేశ్వరరావు తనయుడనే ఆయనకు తొలి అవకాశం ఇచ్చారు. 2004 వరకు తండ్రి అడుగుజాడల్లో నడిచిన ఆయన బ్యాంకులో ఖాతాదారుల డిఫాజిట్లు వంద కోట్ల వరకు పెరిగేలా కృషి చేశారు. 1995 నుంచి 2004 వరకు లాభాలతో తులతూగిన బ్యాంకు కార్యకలాపాలు 2004లో ఒక్కసారిగా హరించుకుపోయాయి.
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కృషి, వాసవి, చార్మినార్ బ్యాంకులు ఎంతో మంది ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టాయి. అశల వలయంలో పడి తిని తినక, కడుపు కట్టుకుని దాచుకున్న మధ్యతరగతి ప్రజలకు చెందిన వేల కోట్ల రూపాయలను దోచేసుకన్నాయి. అయితే ఆ బ్యాంకులు అకస్మాత్తుగా దివాళా తీసినందుకు కుట్రలకు పాల్పడిన చైర్మన్లను పోలీసులు అరెస్టు కూడా చేశారు. అదే దారిలో భీమవరం కో-అపరేటివ్ అర్భన్ బ్యాంకు కూడా వుంది.
అయితే గ్రంధీ శ్రీనివాస్ మాత్రం కొద్దిలో తప్పించుకున్నారు. అంతవరకే ఐదే పర్వాలేదు తప్పించుకున్నాం కదా.. ఇక తమనెవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమాతో రాజకీయ నేత అవతారం ఎత్తి ప్రజాప్రతినిధిగా కూడా మారాడు. కానీ ఆ వెనువెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచి గెలుపోందారు. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బాధితులకు డబ్బులు తిరిగిచ్చేలా చర్యలు తీసుకుంటానని నమ్మబలికి ఎన్నికలలో గెలిచారని, తాను ఓడిపోతే మీ డబ్బులు రావని ఇక అవిపోయినట్లేనని కూడా ఓటర్లను బ్లాక్ మెయిల్ చేశారన్న అరోపణలు వున్నాయి.
అయితే 2009 వరకు వేచి చూసినా బాధితులకు ఒక్క పైనా రాలేదు. దాదపుగా అప్పటి నుంచి ఇప్పటికీ పదేళ్లు కావస్తున్నా.. బాధితులకు స్వాంతన లభించలేదు. వారి సుదీర్ఘపోరాటం నిలిచిపోలేదు. అయితే ఏళ్లు కావస్తుండటంతో కాసింత సోమ్మసిల్లారు. అయితే పవన్ కల్యాన్ వీరిలో మళ్లీ నూతనోత్తేజాన్ని ఇచ్చారు. బాధితుకు అండగా తాను నిలుస్తానని, అన్యాయం జరిగింది కాబట్టే తాను ప్రశ్నిస్తున్నానని గ్రంధీ శ్రీనివాస్ వారికి ప్రతీ పైసా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతే దీంతో అసలు బ్యాంకు విషయాలను మర్చిపోయిన భీమవరం ప్రజలకు మళ్లీ దానిని గుర్తు చేస్తారా.? అంటూ పవన్ కల్యాన్ ను ఎలాగైనా ఓడించాలని అందుకు ఎంతవరకైనా వెళ్తానని భీష్మించుకున్నారట. ఈ మేర సోషల్ మీడియాలో ఓ ఛానెల్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more