Police lodge complaint against Allagadda YSRCP Candidate జనాలపైకి నోట్లను విసిరిన అభ్యర్థిపై పోలీసు కేసు

Case filed against allagadda ysrcp candidate gangula brijendra reddy for throwing money

YSR Congress Party, Lok Sabha, Andhra Pradesh, Telangana movement, Mekapati Rajamohan Reddy, Sub-Inspector, Sirivella Town police, Sirivella Sub-Inspector, Gangula Brijendra Reddy, Timma Reddy, Anwar Basha, Legislative Assembly, YSRCP, AP politics

Sirivella Town police lodged a complaint against YSR Congress Party workers for allegedly trying to lure voters by throwing money in the air ahead of Lok Sabha and Assembly polls in the state.

జనాలపైకి నోట్లను విసిరిన అభ్యర్థిపై పోలీసు కేసు

Posted: 04/05/2019 12:46 PM IST
Case filed against allagadda ysrcp candidate gangula brijendra reddy for throwing money

ఎన్నికల ప్రచారంలో వైసీపీ వింత పోకడ అనుసరించిన ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్‌‌రెడ్డిపై శిరివెళ్ల టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక నేత జనం మీదకు కరెన్సీ నోట్లు వెదజల్లిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఆయనపై పిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలపై డబ్బులు వెదజల్లడం ఎన్నికల మోడల్ కండక్ట్ కు విరుద్దమని చెప్పిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. డబ్బులు తీసుకోవడానికి ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
 
అసలేం జరిగిందంటే.. వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నోట్లు ఇష్టం వచ్చినట్లు వెదజల్లుతున్నారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివేళ్ల గ్రామంలో వైసీపీ నేతలు డబ్బులు వెదజల్లారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో నోట్ల పందారం విచ్చలవిడిగా సాగుతోంది. వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న బ్రిజేందర్‌‌రెడ్డి శిరివేళ్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు. జగన్ నంద్యాల పట్టణం పర్యటన నేపథ్యంలో అనుచరవర్గాన్ని నంద్యాలకు తరలించాలని నిర్ణయించారు.
 
ఈ క్రమంలో భూమా అఖిలప్రియకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న బ్రిజేందర్‌‌రెడ్డి ఆ గ్రామానికి వెళ్లి జగన్ సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ డబ్బులు ప్రజల మీదకు వెదజల్లారు. నోట్లు అందుకునే క్రమంలో ప్రజల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం కూడా ఆళ్లగడ్డ, శిరివేముల పట్టణంలో ఇటువంటి సంఘటనే జరిగినట్లు సమాచారం. దీంతో ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. డబ్బు మదంతో వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangula Brijendra Reddy  code of conduct  Allagadda candidate  YSRCP  Andhra pradesh  politics  

Other Articles