ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖచిత్రం ఎలా వుంది.. ఓటరు నాడి ఎలా వుంది అన్న అంచనాల నేపథ్యంలో అసోసియేషన్ అఫ్ డెమెక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం చంద్రాబాబు పాలన బిలో అవరేజ్ అని తేల్చింది. అయితే పట్టణ ఓటర్లు మాత్రం ఆయన పాలన పర్వాలేదని అన్నా.. గ్రామీణ ఓటరు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో ప్రజల నాడి ఎలా వుందన్న విషయం కూడా అస్పష్టంగా నిగురుగప్పిన నిప్పులా వుందని తేల్చింది.
కాగా న్యూస్ ఎక్స్ ఛానెల్ వెల్లడించిన నివేదికలో ఈ సారి కూడా గత ఫలితాలే వ్యక్తం అవుతాయని తేల్చింది. అయితే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నం, నరసాపురం లోక్ సభ సీట్లను టీడీపీ, వైసీపీలు చెరొకటి గెలుచుకుంటాయని అంచనా వేసింది. న్యూస్ ఎక్స్ ఛానెల్ తో పాటు ఫేస్ బుక్, యూ-ట్యూబ్ లు సంయుక్తంగా నిర్వహించిన పోల్ సర్వేలలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీకి 16, వైసీపీకి 9 స్థానాలు రావచ్చని పేర్కోంది.
టీడీపీకి 43 శాతం ఓట్లు వైసీపీకి 37 శాతం ఓట్లు రావచ్చని, బీజేపీ 7 శాతానికి, కాంగ్రెస్ 6 శాతానికి, ఇతరులు 7 శాతం ఓట్లకు పరిమితం కావచ్చని తెలిపింది. టీడీపీ, వైసీపీ మినహా మరే ఇతర పార్టీకి లోక్ సభ స్థానాలు గెలిచే సత్తా లేదని అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇరు పార్టీలూ చెరో సీటును గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తాయని వెల్లడించింది. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే, టీడీపీకి 92, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 77, కాంగ్రెస్ కు 4, బీజేపీకి 1, ఇతరులకు ఒక సీటు రావచ్చని అంచనా వేసింది.
ఈ దఫా ఎన్నికలు పోటా పోటీగా జరగనున్నాయని పేర్కొంది. అయితే ఈ సర్వేలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుందని తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగి ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తున్న జనసేనకు పార్లమెంటు స్థానాలను రావని, ఇక అసెంబ్లీలో కూడా జనసేన ఒక్కసీటుతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పడం.. ఇది కూడా ఎల్లో మీడియా విషప్రచారం మాదిరిగానే వుందని విమర్శలు వినపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more