ప్రధాని మోదీపై తనకు ఎలాంటి ద్వేషం, ఆగ్రహం లేవని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. 'ఐ లవ్ నరేంద్ర మోదీ' అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పూణెలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడుల గొప్పదనం మన వైమానిక దళానిదని... ఆ దాడులకు రాజకీయం చేయరాదని అన్నారు. నాయకులకు జవాబుదారీతనం ఉండాలని చెప్పారు.
ప్రజలు అడిగే ప్రశ్నలకు తాను ధైర్యంగా సమాధానాలు చెబుతున్నానని... తనలా మోదీ ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారని అన్నారు. మోదీపై తనకు ప్రేమ ఉందని, ద్వేషం ఏమాత్రం లేదని చెప్పారు. కనీస ఆదాయ భరోసా పథకం ద్వారా పేదలకు ఏడాదికి రూ. 72,000 వేస్తామంటూ తాము ఇచ్చిన హామీని నెరవేర్చుతామని రాహుల్ అన్నారు. దేశంలోని రూ.20 కోట్ల పేద కుటుంబాలకు ఏటా రూ.72,000 అందేలా చూడటం, వారిని ఆదుకోవడం తన డ్రీమ్ ఐడియా అని రాహుల్ చెప్పారు.
'మహాభారతంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించడంపైనే దృష్టిపెట్టాడు. మీ అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తాననే అబద్ధాలు నేను చెప్పను. ఎందుకంటే అబద్ధాలు 2-3 నెలల కంటే ఎక్కువ చెల్లుబాటు కావు. నేను మీతో 15-20 ఏళ్లు కలిసి పనిచేయాలనుకుంటున్నాను' అని రాహుల్ చెప్పారు.భారత్ ప్రతి రోజు 27వేల ఉద్యోగాలను కోల్పోతోందని చెప్పారు. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీలాంటి వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు తాము కృషి చేస్తామని రాహుల్ చెప్పారు. ఉద్యోగాల్లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపిందని అన్నారు. దీని వల్ల కోట్లాది ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. నాగపూర్‌లో పతంజలికి భూమి కేటాయించినప్పుడు కానీ, ప్రాజెక్టును హ్యాండిల్ చేసే డబ్బులు, ప్రాజెక్టు నిర్వహణా సామర్థ్యం లేనప్పటికీ రాఫెల్ ఆఫ్ సెట్ కాంట్రాక్ట్‌ను అనిల్ అంబానీకి కేటాయించినప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు వేయలేదని రాహుల్ నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more