టీడీపీ కార్యకర్తలపై, అభిమానులపై నోటితోపాటు చేయి కూడా చేసుకుంటూ తరచూ వివాదాల్లోకి చిక్కకునే సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోమారు వార్తల్లోకెక్కారు. ఇటీవల హిందూపురంలోని తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ విలేఖరిని బెదిరించి తాను రికార్డింగ్ చేసిన విజువల్స్ ను డిలీట్ చేయించడంతో విమర్శలు ఎదుర్కోన్న బాలయ్య ఆ తరువాత మీడియాకు క్షమాపణలు చెప్పారు. అంతటితో ఆగకుండా
తనకు ఎంతమేర మెజారిటీ వస్తుందన్న అంశంలో కూడా ఓ గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తూ తన అభిమానిని.. పీక కోస్తా అంటూ హెచ్చరించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతటితో ఆగకుండా లేపిపారదొబ్బుతా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా ఎన్నికలలో తాను తన కార్యకర్తలపై అగ్రహం వ్యక్తం చేసినా.. లేక మండిపడినా.. లేక చేయి చేసుకున్నా విజయం సాధిస్తానన్న సెంటిమెంటును ఏమైనా పెట్టుకున్నారో ఏమో తిలియదుకానీ ఆయన సంబంధించిన మరో వీడియో ఇప్పుడు నెట్టింట్లో విస్తృతంగా చక్కర్లు కొడుతొంది.
తాజాగా ఓ అభిమానిని నడిరోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అక్కడి టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బాలయ్య.. ఓ యువకుడిపై దాడి చేస్తుండగా చిత్రీకరించిన వీడియో ఇది. అభిమానిని పరిగెత్తించిన బాలకృష్ణ అతడిని పట్టుకుని కొట్టడం కనిపిస్తోంది. అయితే, బాలకృష్ణ ఆ అభిమానిపై చేయి చేసుకోవడానికి ముందు ఏం జరిగిందన్నది విషయాలు తెలియరాలేదు.
అభిమాని వెంటపడి మరీ కొట్టాల్సినంత పెద్ద తప్పు ఏం జరిగిందన్న వివరాలు తెలియాల్సి వుంది. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ వీడియోను పోస్టు చేసింది. కాగా, ఈ వీడియో కొంత అస్పష్టంగా ఉండడంతో బాలయ్యను పోలిన వ్యక్తి అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more