Gurajala YCP candidate gives up before elections.? ఎన్నికలకు ముందే తప్పుకున్న గురజాల అభ్యర్థి.?

Away before the polling this ysrcp candidate gives up

YSRCP Gurajala MLA candidate Kasu Mahesh Reddy, Gurajala YCP MLA candidate, Kasu Mahesh Reddy YS Jagan, shock to YS Jagan, Kasu Mahesh Reddy given up, Kasu Mahesh Reddy on MLA Elections, YS Jagan, YSRCP, Kasu Mahesh Reddy, Gurajala, Yarapathaneni Srinivas, Prashant Kishor, Kasu Krishna Reddy, andhra pradesh, politics

Away before the voting this YSR Congress party leader has given up and is showing no interest in campaign. This has irked party chief YS Jagan. The going to be loser YSRCP candidate is Kasu Mahesh Reddy from Gurajala.

గురజాల వైసీపీ అభ్యర్థి ఎన్నికలకు ముందే తప్పుకున్నారా.?

Posted: 04/08/2019 05:09 PM IST
Away before the polling this ysrcp candidate gives up

మరో 72 గంటల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రజాతీర్పు కోరుతూ పోలింగ్ కు వెళ్లనున్న తరుణంలో.. అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకు సాగుతుండగా, సరిగ్గా ఈ సమయంలోనే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చింతా అనురాధ బాటలోనే గుంటూరు గురజాల అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పయినిస్తున్నారా.. అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజా సర్వేల నివేదిక ప్రకారం కాసు మహేష్ రెడ్డి  ప్రచారంలో వెనుకబడ్డారని.. ఈ క్రమంలో మరింత వేగాన్ని పుంజుకోవాలని హైకమాండ్ అదేశించింది. ఇటీవల గుంటూరు జిల్లా పర్యటనలో పిడుగురాళ్లకు వెళ్లిన అధినేత కూడా కాసు మహేష్ రెడ్డికి ఇదే విషయమై క్లాసు తీసుకున్నారని సమాచారం. ఎంతో వేగంగా ముందుకు సాగాల్సిన తరుణంలో ఇలా వెనకబడిపోతే ఎలా.. మీకు మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రినివాసరావుకు మధ్య కనీసం పది నుంచి పదిహేను వేల ఓట్ల తేడా వుందని తెలుస్తోంది.

ఇప్పటికైనా వేగాన్ని అందిపుచ్చుకోండీ లేదంటే కష్టమేనని వైసీసీ అధినేత జగన్ కాసు మహేష్ రెడ్డికి క్లాస్ తీసుకున్నారని టాక్ వినపిస్తోంది. అయితే ఇప్పటికే వున్నదంతా పెట్టి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించానని ఇంకా వేగం పెంచాలంటే తన వద్ద ఫండ్స్ లేవని కాసు మహేష్ రెడ్డి చేతులెత్తేసారని తెలుస్తోంది. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేత కాసు కిృష్ణారెడ్డి కూడా తన కొడుకు తరపున రంగంలోకి దిగి పరిస్థితులను సరిదిద్దే బాద్యత భుజనా వేసుకున్నా.. పెద్దగా మార్పులు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో కాసు మహేష్ రెడ్డి ఎన్నికలకు 72 గంటల ముందుగానే చేతులెత్తేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles