pawan kalyan critisizes ys jagan for Barbaric custom ఆ ఇంటిముందు ఇంకా అనాగరిక అచారం: పవన్ కల్యాణ్

Pawan kalyan critisizes ys jagan for barbaric custom in pulivendula

pawan kalyan critisizes ys jagan for Barbaric custom in pulivendula, pawan kalyan on ys jagan, pawan kalyan critisizes YS jagan, pawan kalyan critisizes Barbaric custom by dalits, pawan kalyan critisizes Barbaric custom in pulivendula, pawan kalyan, janasena, pulivendula, dalits, barbaric custom, Andhra Pradesh, Politics

Actor turned Politician pawan kalyan critisizes YS JaganMohan Reddy for making dalits to follow Barbaric custom in Pulivendula.

పులివెందులలో ఆ ఇంటిముందు ఇంకా అనాగరిక అచారం: పవన్ కల్యాణ్

Posted: 04/08/2019 05:54 PM IST
Pawan kalyan critisizes ys jagan for barbaric custom in pulivendula

పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప.. బానిస బతుకులు బతుకుదాం.. పల్లకీలు మోద్దాం.. కుదరిని పని అని, కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారని ప్రశ్నించారు. జగన్ మాదిరిగా పది మంది చేత పనులు చేయించుకుని టిక్కెట్లు అమ్ముకోలేదని, అటువంటి అవసరం తనకు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. పులివెందులలో దళితులకు రక్షణ లేదని అన్నారు.

జగన్ మాట్లాడితే కేసిఆర్ ను తీసుకుని వస్తారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట్లాడి.. కేసిఆర్ మాటతప్పరని విమర్శించారు. మాయావతిని పీఎం చేయాలని తాము భావిస్తున్నామని అందుకు శక్తివంచనలేకుండా తాము కృషి చేస్తున్నామని తెలిపారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన రాజకీయ పార్టీలు వారిని నిజంగా నాయకులుగా ఎదిగేందుకు ఎందుకు దోహదపడటం లేదని ప్రశ్నించారు.

దళితులలో మళ్లీ దళితులను జగన్ వేరు చేశారని అరోపించారు. వస్తే జగన్.. లేకుంటే చంద్రబాబు.. అంతే కానీ మూడో వ్యక్తిని రానివ్వరా? అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల్లోని దళితులు మీకు న్యాయం జరుగుతుందన్న పార్టీల్లో చేరాలని అన్నారు. ఇప్పటికీ పులివెందులలో అనాగరిక ఆచారం నడుస్తుందని అన్నారు. అక్కడ వైసీపీ నాయకులు ఇళ్ల ముందు నుంచి వెళ్లాలంటే చెప్పులు వదిలి వెళ్లాలని అన్నారు. మాయావతి గారి గురించి మాట్లాడుతూ.. ఆమెలో బెహన్‌జీ కాకుండా అమ్మ కనపడింది అని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  pulivendula  dalits  barbaric custom  Andhra Pradesh  Politics  

Other Articles