Hero Nithin donates Rs 25 Lakh to Jana Sena జనసేనకు రూ.25 లక్షల విరాళమిచ్చిన హీరో నితిన్..

Nithin donates to janasena sudhakar reddy hands overed cheque to pawan kalyan

Nithin donates to janasena, Nithin donates Rs 25 Lakhs to janasena, producer sudhakar reddy, Pawan Kalyan, Nithin, Jana Sena, Sudhakar reddy, Tollywood, Andhra pradesh, Politics

Tollywood hero Nithin has donated Rs 25 lakh towards Jana Sena Party (JSP). Nithin’s father Sudhakar Reddy has handed over the cheque to JSP chief Pawan Kalyan.

జనసేనకు రూ.25 లక్షల విరాళమిచ్చిన హీరో నితిన్..

Posted: 04/09/2019 02:49 PM IST
Nithin donates to janasena sudhakar reddy hands overed cheque to pawan kalyan

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ తన బాస్ అంటూ అదే చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరోకు అభిమానినని గర్వంగా చెప్పుకుంటారు. ఆ హీరో మరెవరో కాదు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని అవకాశం చిక్కినప్పుడల్లా తన సినిమాలలో కూడా సందర్భానుచితంగా డైలాగుల్లో కూడా చూపుతుంటాడు నితిన్. అయితే ఇకపై నితిన్ తన బాస్ చిత్రాలను చూడలేదు. ఎందుకంటే ఆయన నటనకు దూరంగా ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లారన్న విషయం తెలిసిందే.

అభిమానం అన్నది ఒక్కసారి పడితే.. ఆభిమానించే వ్యక్తి ఎక్కడ వున్నా అది అలాగే పెరుగుతొంటోంది. అదే మాదిరిగా నితిన్ అభిమానం కూడా పెరుగుతూపోతోంది. అందుకనే తన బాస్ స్థాపించిన జనసేన పార్టీకి తన వంతుసాయంగా నితిన్ ఏకంగా 25 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేనకు తన వంతు సాయంగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు నితిన్. తాను ప్రకటించిన విరాళాన్ని తన తండ్రికి అందజేశాడు.

నితిన్ తండ్రి, సినీనిర్మాత సుధాకర్ రెడ్డి క్రితం రోజు రాత్రి భీమవరంలో పవన్ కల్యాణ్ ను కలసి నితిన్ ప్రకటించిన విరాళాన్ని జనసేనానికి అందజేశారు.  అంతకుముందు ఆయన డీహైడ్రేషన్ తో బాధపడుతున్న పవన్ ను పరామర్శించారు. ఆయన అరోగ్యం ఎలా వుందని స్వయంగా వాకాబు చేశారు. ఈ సందర్భంగా రూ. 25 లక్షల చెక్ ను అందించారు. తనపై ఎంతో అభిమానం చూపిన నితిన్, సుధాకర్ రెడ్డిలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Nithin  Jana Sena  Sudhakar reddy  Tollywood  Andhra pradesh  Politics  

Other Articles