తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ కొత్త జిల్లా నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరికల్ మండలం తీలేరులో ఈ ఘోరం జరిగింది. ఉపాధి హామీ పనులలో పనిచేస్తున్న 10 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషయంగా వుంది. అయితే ఈ దుర్ఘటన నుంచి మరో ముగ్గురు మహిళలు తృటితో తప్పించుకున్నారు. ఈ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని.. ఈ పనుల కోసం 15 మంది వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఉపాధి హామీ పనుల్లో భాగంగా తీనేరు గ్రామ శివార్లలో చెరువు తవ్వకాలు పనులు జరుగుతున్నాయి. బాగా లోతుగా పనులు చేపట్టారు. జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. కింద ఉండి కూలీలు పనులు చేస్తుండగా.. పై నుంచి మట్టిదిబ్బలు పడ్డాయి. పెద్దపెద్ద దిబ్బలు కావటంతో కూలీలు అందరూ వాటి కింద చిక్కుకుపోయారు. మట్టితోపాటు రాళ్లు కూడా పడ్డాయి. దీంతో ఘటనా స్థలంలోనే 10 మంది కూలీలు చనిపోయారు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని గ్రామస్థులు, మృతుల బంధువులు అరోపిస్తున్నారు. 20 నుంచి 25 అడుగుల లోతులో పనులు జరుగుతున్నాయి. అంతెత్తు నుంచి మట్టిదిబ్బలు, రాళ్లు పడటంతో వెంటనే వారిని కాపాడలేకపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం, యంత్రాలతో ఇష్టమొచ్చినట్లు పనులు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించనున్నారు.
చనిపోయిన కూలీలు అందరూ మరికల్ మండలం తీనేరు గ్రామస్తులుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నేతలు వెళ్లి పరిశీలించటానికి ఇబ్బందిగా మారింది. అయితే, మృతులంతా మహిళలే కావడం గమనార్హం. ఎండ ఎక్కువగా ఉండడంతో వీరంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతులు వీరే..
1)పి. అనురాధ(30)
2) బీమమ్మ(40)
3) బుడ్డమ్మ(26)
4) బి.లక్ష్మి(28)
5) కె. లక్ష్మి(30)
6) మంగమ్మ(32)
7) అనంతమ్మ(45)
8) కేశమ్మ(38)
9) బి. అనంతమ్మ(35)
10) లక్ష్మి (28)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more