సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య మర్డర్ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ప్రేమించినవాడే అమె పాలిట కాలయముడై తన ప్రాణాలను బలిగొన్నాడని తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో లావణ్యను చంపింది తానేనని అంగీకరించాడు నిందితుడు. ప్రేమించి, లోంగదీసుకుని.. పెళ్లి అనేసరికి తప్పించుకోలేక మర్డర్ ప్లాన్ చేసిన కరడుగట్టిన కసాయి గురించిన వివరాలను రామచంద్రపురం పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపారు.
బీహార్‌కు చెందిన మనోజ్ షా కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలసవచ్చి సూరారం కాలనీలో స్థిరపడింది. ఆయన కుమారుడు సునీల్ మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న సమయంలో అదే కాలేజీకి చెందిన రామచంద్రాపురం నివాసి శ్రీనివాస్‌రావు కుమార్తె లావణ్య (25)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం బీటెక్ పూర్తైన తర్వాత కూడా కోనసాగి ఇద్దరిమధ్య ప్రేమకు దారితీసింది. దీంతో లావణ్యను పెండ్లి చేసుకొంటానని నమ్మించిన సునీల్.. అమెను లోబర్చుకున్నాడు.
పెళ్లి చేసుకోమ్మని సునీల్ ను తరచూ అడుగుతున్న లావణ్య.. ఈ మధ్యకాలంలో మరింతగా ఒత్తిడి తెచ్చింది. దీంతో అమెను అడ్డు తోలగించుకోవాలని నిర్ణయించుకున్న సునిల్ అమెను హత్యచేసి.. సూట్ కేసులో శవాన్ని పెట్టి తాను నివసించే సూరరం కాలనీకి వెళ్లేదారిలోని కాలువలో పడేశారు. యువతి తల్లిదండ్రులు అనుమానం రావడంతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేయగా.. అదే సమయంలో యువతి శవం సూరారం కాలనీలో బయటపడటం.. కేసు విచారణకు సులభం చేసింది.
పథకం ప్రకారమే..
పెళ్లి చేసుకోవాలని వెంటపడి ఒత్తడి తీసుకువస్తున్న లావణ్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సునీల్ పక్క పథకం ప్రకారమే అమెను హత్య చేశాడు. ఎలా అంటే.. ఉద్యోగ నిమిత్తం తాను సూడాన్ వెళ్తున్నానని, లావణ్యను కూడా తీసుకెళ్తున్నట్టు ఆమె కుటుంబీకులను ఒప్పించాడు. ఈనెల 4న ఇద్దరూ సూడాన్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరికి యువతి తల్లిదండ్రులు విమానాశ్ర యం వరకు వచ్చి వీడ్కోలు పలికారు.
సూడాన్ వెళ్తున్నట్టు నకిలీ విమాన టికె ట్లు సంపాదించిన సునీల్.. విమానాశ్రయంలోకి అలా వెళ్లి ఇలా బయటకు వచ్చాడు. సూడాన్ వెళ్లే విమానం రద్దయిందంటూ లావణ్యను నమ్మించి ఆ రాత్రి శంషాబాద్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. మరుసటిరోజు పెండ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో లావణ్యను చంపి.. శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కాడు. 6వ తేదీన రాత్రి సూరారం సుందర్‌నగర్‌లోని ఇంటికి వస్తూ స్థానికంగా ఉన్న మోరీలో లావణ్య శవం ఉన్న సూట్‌కేసును పడేశాడు.
సూడాన్ నుంచి చాటింగ్ చేస్తున్నట్టు లావణ్య తల్లిదండ్రులకు వాట్సప్ మెసేజ్‌లు పెట్టేవా డు. ఇండియాకు తిరిగి వస్తున్నట్టు 7న లావణ్య మొబైల్ నుంచి సమాచారమిచ్చాడు. తమ కూతురు ఇంటికి తిరిగిరాక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి ఆర్సీపురం పోలీసులను ఆశ్రయించారు. సునీల్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకొని విచారించగా లావణ్యను తానే హత్యచేసినట్టు ఒప్పుకొన్నాడు. నాలాలో నుంచి లావణ్య మృతదేహాన్ని వెలికితీసి గాంధీ దవాఖానకు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more