ఆంధ్రుల అభిమాన నటుడు, ఆరాధ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు ఎంతటి పాపులారిటీ సంపాదించారో తెలుగు ప్రజలకు తెలియనిది కాదు.. ఇక రాజకీయ రంగంలోనూ ఆయన పెను మార్పులు తీసుకువచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ మహానటుడ్ని చూసినవారంతా ఆయనకేం తక్కువ.. అన్న వ్యాక్యలు చేసినా.. నిజానికి మాత్రం ఎన్టీఆర్ కూడా తన జీవితంలో చాలా ఆవేదన భరిత క్షణాలను గడిపారని, ఆయనకు నిత్యం తన కొడుకులపైనే ఎక్కువ అలోచన వుండేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత ఆ మహనీయుడి జీవితంలోని బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిశాయి. ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండే వారు సైతం మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలను.. అన్నగారు తమతో అడపాదడపా చెప్పుకున్న అంశాలను మీడియాతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ వద్ద చాలా కాలం పాటు డ్రైవర్ గా పనిచేసని లక్ష్మణ్ ఎన్నటీఆర్ తన కొడుకులతో ఎలాంటి సుఖాన్ని పోందలేదన్నారు.
ఆయన మాటల అంతరార్థం ఏంటంటే.. ఎన్టీ రామరావు తన కుమారుల గురించే ఎక్కువగా బాధపడుతుండేవారని, తనతో కూడా ఆ విషయాలు చెప్పుకుని బాధపడేవారని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటన్నవి కూడా ఆయన వివరించారు. ఎన్టీ రామారావు కుమారులు తండ్రి అస్తిపై బతికేస్తున్నారే తప్ప.. సొంతంగా పని చేసి పైకొద్దామనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదని.. ఈ విషయంలోనే ఎన్టీఆర్ మనసులో చాలా బాధపడేవారు. 'ఏం లచ్చన్నా... ఎవ్వడూ ప్రయోజకుడు లేడు, నా పేరు నిలిపేవాడు లేడు. ఏదో బాలయ్య కొద్దిగా ఉన్నాడు, కానీ పూర్తి నమ్మకం లేదు.' అని చెబుతూ ఒకసారి బాధ పడ్డారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.
కొడుకులతో ఎన్టీ రామారావు సుఖపడలేదని.. ఆయన్ను చివరి వరకు వారు కష్టపెట్టారని లక్ష్మణ్ అవేదన వ్యక్తం చేశారు. కొడుకులంతా కేవలం డబ్బు కోసమే తండ్రి వద్దకు వచ్చేవారని ఆయన తెలిపారు. డబ్బు అవసరం అయినపుడు వచ్చి పెద్దాయన ముందు రెండు చేతులు కట్టుకుని నిలబడేవారని చెప్పారు. డబ్బు అవసరం లేనంత వరకు తండ్రిని చూసేందుకు కూడా వచ్చేవారు కాదని అవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఎన్టీఆర్ డబ్బులు కవర్లలో పెట్టి ఇస్తే... తాను, మోహన్ వెళ్లి స్వయంగా అందరికీ ఇచ్చి వచ్చేవారమని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.
మొదటి సారిగా ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయినపుడు జయశంకర్ బాబుకు కూర్చో పెట్టి చాలా చెప్పాడు. ''నువ్వు బయట తిరిగు... ఏ ఫ్యాక్టరీ పెడితే బావుంటుందనే విషయం కనుక్కో, నేను నీకు ఫ్యాక్టరీ పెట్టిస్తాను, ఐదు, పది వేల మందికి భోజనం పెట్టినవారం అవుతాం. థియేటర్ చూసుకోవడం ఏమిటి? దాన్ని చూసుకోవడం కూడా మీకు చేతకాదు... దానికి ఇంకా ఓ మేనేజర్‌ను పెట్టుకుంటారు.'' అంటూ జయశంకర్ బాబుకు పెద్దాయన చెప్పినట్లు లక్ష్మీణ్ వెల్లడించారు. కాగా, కూతురు పురంధరేశ్వరి రోడ్ నెం.13 దగ్గర్లనే ఉండేవారు. అప్పుడప్పుడూ క్యారేజ్ పట్టుకుని వచ్చేవారని లక్ష్మణ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more