తోడబుట్టిన వారు పొట్లాడుకుంటారన్న సంగతి అందరికీ తెలుసు. అదే వారు కవలలైతే పోటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇద్దరూ ఒకే వస్తువును ఇష్టపడటం.. ఒక దాని కోసం ఇద్దరూ ఒకేలా అలోచించడం కవలల్లో సర్వసాధారణం. దీంతో ఇద్దరూ పోట్లాడుకోవడం కూడా కామన్. అయితే ఇది పుట్టిన తరువాత.. వారు పెరుగుతున్న క్రమంలో జరిగే తంతు. కానీ, తల్లి గర్భంలో ఉన్న సమయంలోనే ఇద్దరు కవలలు కొట్టుకుంటే... ఇది వినడానికే చోద్యంలా అనిపించినా.. పచ్చి నిజం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగు మాసాల గర్భంతో ఉన్న వేళ, వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసారు. తన భార్య కూడా వెళ్లిన భర్త.. వైద్యులు తీసిన స్కానింగ్ వీడియోను తన మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు. తన భార్య గర్భంలోని ఇద్దరు అమ్మాయిలు కవలలుగా పెరగుతున్నారని సంతోషపడ్డాడు. అయితే వారిద్దరూ ఒకరితో ఒకరు ఫైటింగ్ కు దిగడం చూసి ఆయన కూడా అశ్చర్యపోయాడు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వీరిద్దరూ బాక్సర్లు అయిపోవడం ఖాయమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అయితే బయటకు వచ్చాక వీరు ఇంకెలా తన్నుకుంటారోనన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. వీరిద్దరు ఇప్పుడు పుట్టేశారు. ఈ వీడియో గత ఏడాది తన భార్య నాలుగు మాసాల గర్భం దాల్చినప్పటిది. ఈ ఇద్దరు చిన్నారులకు తమ తల్లిదండ్రులు చెర్రీ, స్ట్రాబెర్రీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరు పెద్దగా పొట్లాడుకోవడం లేదని కూడా ఆ తండ్రి తన వీడియో పోస్టు చేసిన కింద పేర్కోన్నాడు. అయితేనేం.. తల్లిగర్భంలోనే కొట్టుకుంటున్న ఇద్దరు ఆడ కవలల వీడియో మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఏకంగా ఈ వీడియోను ఇప్పటి వరకు పాతిక లక్షల మంది వీక్షించారంటే మాటలా మరి.. ఇక అలస్యమెందుకు వీరూ ఆ వీడియోను చూసేయండి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more