తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఓటరుకు డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా మీడియా కెమెరాలకు చిక్కారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ నెల 18న జరగనున్న రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటరుకు ఆయన పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా పంపిణీ చేయడంపై పెను దుమారం రేగుతోంది. విపక్షాల అభ్యర్థుల ఇళ్లపై, కార్యాలయాలు, అనుచరుల ఇళ్లు, ఆపీసులపై దాడులు నిర్వహించే ఈసీ అధికారులు, ఐటీ అధికారులు.. అధికార పక్షంలో అందులోనూ బీజేపితో కూటమికట్టిన పార్టీలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
అసలేం జరిగిందీ అంటే.. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సీఎం పళనిస్వామి సేలంలోని ప్రచారం నిర్వహించకుండా కేవలం అక్కడి ఓటర్లను మాత్రం తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ.. పార్టీ కరపత్రాలను పంచుతూ.. స్థానికులకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. ఈ క్రమంలో అదే రోడ్డుపై ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లిన పళనిస్వామి అక్కడున్న మహిళతో మాట్లాడుతూ తమకు ఓటేయాలని కోరారు. సీఎం తన వద్దకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి అమెకు తమ పార్టీ కరపత్రాన్ని ఇచ్చారు.
ఆ తరువాత వెంటనే వెనుకనున్న వ్యక్తి అందించిన డబ్బును అదే పాంప్లెట్లలో పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎం ఇచ్చిన డబ్బును ఆ మహిళ వద్దని చెబుతున్నా ఆయన వినిపించుకోకుండా ముందుకు కదిలారు. సీఎం పళనిస్వామి డబ్బులు ఇస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కి అనంతరం సోషల్ మీడియాకు ఎక్కింది. ఓటుకు నోటు అన్న విధంగా స్వయంగా ముఖ్యమంత్రే డబ్బులు పంచుతున్నా.. ఈసీ అధికారులకు కనిపించడం లేదా.? లేక తమ వాళ్లు డబ్బు పంచినా అది నేరం కాదన్నట్లు ఈసీ వ్యవహరిస్తోందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల, పార్టీ నేతల, వారి అనుచరుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏమీ లేకపోయినా.. కేవలం వారిని సమయాన్ని వృధా చేయడంతో పాటు ప్రజల్లో ఒకింత అనుమానాలను వెదజల్లే విధంగా ఈసీ అధికారులు, ఆదాయపన్నుశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని తమిళనాడు విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇక తేని జిల్లాలోని అన్నాడీఎంకే కార్యాలయంలో పోలీసులు రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more