దేశంలో ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. ఏటా లక్షలాది మంది యువత చదువు పూర్తి చేసుకుని కాలేజీలు, యూనివర్శిటీల నుంచి బయటకు వస్తున్నాయి. అందులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. అయితే కొత్త ఉద్యోగాలు రావడం మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితి నేడు దేశంలో చోటుచేసుకుంది. గత రెండేళ్ల కాలంలో దేశంలో 50లక్షల ఉద్యోగాలకు గండి పడిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలకు ఈ నివేదిక సాక్ష్యంగా నిలుస్తోంది.
దేశంలో నిరుద్యోగంపై అజీమ్ ప్రేమ్జీ యూనివర్శిటీ ఓ సర్వే చేసింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం 2016-18 మధ్య దేశవ్యాప్తంగా 50లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. 2016లో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినప్పటి నుంచి ఈ ప్రకియ కొనసాగింది. ఉద్యోగాలకు గండి పడటానికి నోట్లరద్దే ప్రత్యక్ష కారణం కాకపోయినప్పటికీ యాదృచ్ఛికంగా అప్పటినుంచే ఉద్యోగాలు ఊడిపోవడం ఆందోళన కలిగించే విషయం.
నివేదికలోని ముఖ్యాంశాలు
* ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువ.
* 20-24 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో నిరుద్యోగిత ఎక్కువగా నమోదవుతోంది.
* 20-24 ఏళ్ల వయసున్న పట్టణ యువకుల్లో 60 శాతం నిరుద్యోగిత నమోదైంది.
* గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉన్నత విద్యనభ్యసించిన యువకుల్లో 20 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు.
* గత రెండేళ్ల కాలంలో ఉన్నత విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కూడా భారీగా తగ్గాయి.
* గ్రామాల్లో ఉపాధి హామీలా.. పట్టణాల్లో రోజుకు రూ.500వేతనంతో సంవత్సరానికి 100రోజుల ఉపాధి పథకం రూపకల్పనకు సిఫార్సు
* పరిస్థితులు ఇలాగే వుంటే మరో రెండు దశాబ్దాలలో దేశంలోని యాభైశాతం జనాభా నగరాల్లోనే
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more